పురాతన భవనం పునరుద్ధరణ
సాక్షి, చైన్నె: చైన్నెలోని జార్జ్‌టౌన్‌లో రూ. 9.85తో పురాతన భవనాన్ని పునరుద్ధరించారు. ఇందులో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సేవలను మళ్లీ ప్రారంభించారు. 160 ఏళ్ల నాటి ఈ పురాతన భవనం జార్జ్‌టౌన్‌లోని రాజాజీ రోడ్డులో ఉంది. ఈ భవనాన్ని 1864లో నిర్మించారు. ఈ నిర్మాణ శైలిలో అద్భుతంగానూ, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుది. ఈ పురాతన భవనాన్ని మద్రాస్ టెర్రస్ అని కూడా పిలుస్తారు. 24,908 చదరపు అడుగుల విస్తీర్ణంలో, టేకు కలపతో అప్పట్లో ఈ భవనం తీర్చిదిద్దారు. ఈ భవనం పురాతనత చెక్క చెదరకుండా ప్రస్తుతం తీర్చిద్దారు. ఇక్కడ రిజిష్ట్రేషన్ల సేవల పనరుద్ధరణ కార్యక్రమం సోమవారం జరగ్గా, ఇందులో వాణిజ్య పన్ను రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తి, హిందూ ధర్మాదాయ శాఖమంత్రి శేఖర్‌బాబు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి కుమార్ జయంత్, రిజిస్ట్రేషన్ల విభాగం హెడ్ దినేష్ పొన్‌రాజ్, చైన్నె జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ జగ్డే తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ బహిరంగ సభలు
సాక్షి,చైన్నె : త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతృత్వంలో బహిరంగ సభలకు ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఈ విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణను మరింత విస్తృతం చేస్తూ, మద్దతుగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 23న తిరుచ్చి, 25న తిరునల్వేలి, ఏప్రిల్ 5న వేలూరు, 12న కాంచీపురం, 19న సేలం, 26వ తేదీన చైన్నె, మే 3వ తేది మదురై, మే 11న కోయంబత్తూరులలో బహిరంగ సభలను నిర్వహించి త్రిభాషా విధానం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించనున్నారు. అలాగే, ఇక్కడకు తరలి వచ్చి ప్రజల మద్దతును సంకతాల సేకరణ ద్వారా కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
మానవ భద్రత లక్ష్యంగా ఒప్పందాలు
సాక్షి, చైన్నె : మానవ భద్రతే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పెల్బీ ఇంటర్నేషనల్ నిర్వహించింది. తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్, సైన్స్(డబ్ల్యూఏఏ)తో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివరాలను వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అధ్యక్షుడు డాక్టర్ గ్యారీ జాకబ్ ప్రకటించారు. మానవ భద్రతా విద్యను పాఠశాలల్లోకి అనుసంధానించడంలో సహకారం ఓ ప్రధాన అడుగును సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, మానవ భద్రతా అవగాహనతో భవిష్యత్ నాయకులకు సాధికారత కల్పించడం తమ అవగాహన లక్ష్యంగా పేర్కొన్నారు. మానవ భద్రతా పరిజ్ఞానంతో తమ భాగస్వామ్యం సూత్రాలను నిర్ధారిస్తామన్నారు. మానవ భద్రత భారతదేశం అంతటా వేలాది మంది విద్యార్థులను చేరుకుంటుందని, వారిని సిద్ధం చేస్తుందన్నారు. స్పెల్బీ ఇంటర్నేషనల్ మానవ హక్కులను విస్తరించడానికి కట్టుబడి ఉందని, విద్యాలయాలలో ఈవెంట్‌లు, వెబ్‌నార్లు, సెమినార్లు, పోటీలు , ప్రచారాలు సర్వేలు, పరిశోధన కార్యక్రమాలు, కళ, వ్యాసాలు , వక్తృత్వ తదితర పోటీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
బస్సు ప్రమాదంలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని కేజీ కండ్రిగలో ప్రభుత్వ టౌన్ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో అమ్మయార్‌కుప్పంకు చెందిన కార్మికులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలతో చైన్నెలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన జ్యోతి కుమారుడు అరసు(22) సోమవారం మృతి చెందాడు. దీంతో బస్సు ప్రమాద మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
పురాతన భవనం పునరుద్ధరణ
పురాతన భవనం పునరుద్ధరణ
Comments
Please login to add a commentAdd a comment