పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్
తమిళసినిమా: స్టార్ హీరోయిన్లకు కెరీర్ పరంగా బ్రేక్ రావచ్చేమో గానీ, పుల్ స్టాప్ మాత్రం పడదు. ఉన్నత స్థాయిలో రాణించిన చాలా మంది కథానాయకిలు అప్ అండ్ డౌన్ చూసిన వారే. అలాంటి పరిస్థితులనే సెకెండ్ ఇన్నింగ్ అంటారు. అయితే అలా కెరీర్ డౌన్ అయినప్పుడు మాత్రం కామెంట్స్ ఎదుర్కోక తప్పదు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. ఇంతకు ముందు తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటిది ఈ భామ నటించిన కొన్ని తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో కొత్త అవకాశాలు ముఖం చాటేసాయి. దీంతో పూజాహెగ్డే పని అయిపోయింది. ఇక మూట ముల్లె సర్దుకోవాల్సిందే అనే కామెంట్స్ హల్ చల్ చేశాయి. అయితే తాజాగా పూజ హెగ్డే చేతిలో మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉండటం విశేషం. దీన్ని ఆమెకు సెకండ్ ఇన్నింగ్ అంటారు లేక చిన్న గ్యాప్ అంటారు గాని పూజా హెగ్డే ను తాజాగా అందుకుంది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనే అని చెప్పక తప్పదు. ఈమె మార్కెట్ బాగా పడిపోయిన సమయంలో నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్‌లోనూ నటించే లక్కీఛాన్స్‌ను పూజా హెగ్డేనే అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నటుడు రాఘవ లారెనన్స్ పూజహెగ్డేకు మరో అవకాశం కల్పించారు. ఈ మూడు చిత్రాల్లో సూర్య జంటగా నటించిన రెట్రో చిత్రం ముందుగా తెరపైకి రానుంది. సక్సెస్‌ఫుల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఇందులో నటుడు జయరాం, కరుణాకరన్, జోజు జార్జ్, సుజిత్ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగులు పూర్తి చేసుకున్న రెట్రో చిత్రం ప్రస్తుతం నిర్మాణానాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రాన్ని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు నటి పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకున్నారన్నది. ఆమె డబ్బింగ్ చెబుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుంది. ఆ విధంగా నటి పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయ్యారన్నమాట.
పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్
Comments
Please login to add a commentAdd a comment