యమకాతగి విజయం సంతృప్తి నిచ్చింది
తమిళసినిమా: నైసాట్ మీడియా వర్క్స్ పతాకంపై శ్రీనివాసరావు జలగం నిర్మించిన చిత్రం యమకాతగి. అరుణ శ్రీ ఎంటర్‌టైనర్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ రాహుల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. పెప్పిన్ జార్జ్ జయశీలన్ కథ, బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటి రూప కడువయుర్ ,నరేంద్ర ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించగా, గీత కై లాసం, రాజు రాజప్పన్, సుభాష్ రామస్వామి, హరిత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి సుజిత్ సార్ ఛాయాగ్రహణం, జెసిన్ జార్జ్ సంగీతాన్ని అందించారు. కాగా జాతి వివక్షత, గ్రామీణ రాజకీయాలు ఇతివతంగా రూపొందిన ఈ చిత్రం గత ఏడవ తేదీన తెరపైకి వచ్చింది. దీన్ని తమిళనాడులో యశ్వా పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. కాగా చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నేపథ్యంలో యూనిట్ వర్గాలు థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు పెప్పిన్ జార్జ్ జయశీలన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాతలకు ఒక్క పేజీ లో రాసిన ఐడియాలు మాత్రమే చెప్పానని వెంటనే వారు బాగుంది కథను డెవలప్ చేయమని చెప్పడం వల్లే ఈ చిత్రం రూపొందడం, విజయం సాధించడం జరిగిందని పేర్కొన్నారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్ రాహుల్ మాట్లాడుతూ తను కథానాయకుడు కావాలి అని 20 ఏళ్ల క్రితం చిత్రపశ్రం లోకి వచ్చానని ఒక చిత్రంలో హీరోగా నటించాలని చెప్పారు. ఆ తర్వాత తగిన అవకాశాలు తాగడంతో తానే ఇతరులకు అవకాశాలు కల్పించాలన్న భావనతో చిత్ర నిర్మాణం సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా చి యమకాతగి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ చిత్ర విజయం మరిన్ని చిత్రాలను నిర్మించడానికి దోహదపడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత శ్రీనివాసరావు జలగం మాట్లాడుతూ తమ తొలి ప్రయత్నానికి యూనిట్ సభ్యులందరూ ఎంతగానో సహకరించారని, వారందరికీ విచిత్రాన్ని విజయవంతం చేస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. యమకాతగి చిత్రం విజయం సంతప్తినిచ్చిందని, థియేటర్లు ఫుల్ అవుతున్నాయని అయితే ఈ చిత్రానికి మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా వేదికపై యూనిట్ సభ్యులు మహిళ పాత్రికేయుల సమక్షంలో కేక్ కట్ చేసి చిత్ర విజయానందాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment