పేట కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒంట్లో హుషారు, మనిషిలో సత్తా ఉంటే వయసుతో పనేముంటుంది. నటుడు రజినీకాంత్ ఇందుకు ఓ ఉదాహరణ. ఏడు పదుల వయసు పైబడినా ఈయన ఇప్పటికీ యువ హీరోలతో పోటీపడే విషయములో తగ్గేదేలే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వరుసగా చిత్రాలు చేస్తూ యువ నటులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకుండానే జైలర్ –2 చిత్రానికి సిద్ధమైపోవడం చూస్తేనే ఆయన స్పీడ్ ఎలా ఉందో తెలుస్తుంది. కాగా ఇటీవల రజనీకాంత్ యువ దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు పా. రంజిత్ దర్శకత్వంలో కబాలి, కాలా వంటి సక్సెస్ నక్షత్రాల్లో నటించిన రజనీకాంత్ ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట, నెల్సన్ దర్శకత్వంలో జైలర్ ,అదేవిధంగా జైభీమ్ చిత్రం ఫేమ్ టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దశరత్వంలో కూలీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది దీంతో ఏమాత్రం విరామం లేకుండా మరోసారి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రంలో నటించటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఈ చిత్రం ప్రారంభ దశలో ఉండగానే రజనీకాంత్ మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారన్నది తాజా సమాచారం. ఈయన మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తెరపైకి వచ్చిన పేట చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. జైలర్– 2 చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన చిత్రం రజినీకాంత్‌తోనే అనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment