తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్ రద్దు
సాక్షి, చైన్నె: తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్‌లు రద్దు చేయడానికి చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. చైన్నె, కోవై, తిరునెల్వేలి వంటి ముఖ్య నగరాలలో తమిళంలో పేరు బోర్డులు కచ్చితంగా ఉంచాలని, దాన్ని క్రమంగా పాటించాలని, ఆ విధంగా పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది . చైన్నె నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ తదితర అన్ని రకాల వ్యాపార సంబంధిత కార్యాలయాల నేమ్ బోర్డుల్లో పేర్లు పెద్దవిగా తమిళ అక్షరాలలోను, దానికంటే చిన్న అక్షరాలలో ఆంగ్లం లేదా ఇతర భాషలు ఉండాలన్న ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యాపారులు పాటించడం లేదు. అయితే తమిళ అక్షరాలు అతి చిన్నవిగాను, ఇంగ్లీషు అక్షరాలు అతి పెద్దవిగాను అనేక నేమ్ బోర్డులు నగరంలో కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి కార్పొరేషన్‌కు ఫిర్యాదులు చేరాయి. చైన్నె కార్పొరేషన్‌లో 70 వేల దుకాణాలు లైసెన్స్ పొంది నినర్వహిస్తున్నాయి.ుు. వీటిలో ప్యారిస్, సౌకార్‌పేట వంటి ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో తమిళ నేమ్ బోర్డులు లేనట్టు సమాచారం. తమిళంలో నేమ్ బోర్డులు పెట్టని దుకాణాలకు వివరణ కోరుతూ నోటీసులు పంపించాలని చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. ఏడు రోజుల్లోపు బోర్డులను సరి చేయకుంటే వాటి లైసెన్స్‌ను రద్దు చేసే విధంగా నిర్ణయించారు. సంబంధించి కార్పొరేషన్ అధికారుల అధ్యక్షతన సమావేశం నిర్వహించి తమిళంలో పేర్ల బోర్డులు పెట్టే విధంగా దుకాణాలకు నోటీసులు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్‌లో ఇందుకుగాను సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తమిళంలో పేర్ల బోర్డులు లేని దుకాణాలపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్పొరేషన్ కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాలలో ఉన్న దుకాణాల గురించి సమాచారం తెలపాలని అఽధికారులు సూచించారు.
● చైన్నె కార్పొరేషన్ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment