వీఐటీ, స్వామినాథన్ ఫౌండేషన్ ఒప్పందం
కొరుక్కుపేట: చైన్నెలోని వీఐటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌న్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఐటీ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య డ్రోన్‌న్‌లపై సహకార పరిశోధన, ఇతర పర్యావరణ కాలుష్య అధ్యయనాల కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో వీఐటీ వ్యవస్థాపకుడు విశ్వనాథన్, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సౌమ్య స్వామినాథన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. సౌమ్యస్వామినాథన్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, రక్షణ కోసం తమిళనాడు గొప్ప చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. వీఐటీ చాన్స్‌లర్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధ చెందిన దేశంగా మారాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని గుర్తు చేశారు. ప్రత్యేక అతిథులుగా శ్రీలంక రక్షణ శాఖ సహాయ కార్యదర్శి సచిని దిసనాయకే, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం, కెప్టెన్ లక్ష్మీ, వీఐటీ సలహాదారు కల్యాణి, వీఐటీ అసోసియేట్ వైస్ చాన్స్‌లర్ త్యాగరాజన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment