టెస్ట్ క్రీడా కథా చిత్రం మాత్రమే కాదు
తమిళసినిమా: నటుడు మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం టెస్ట్. ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా అవతారమెత్తి తన వై నాట్ స్టూడియోస్ ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. నటుడు నాజర్, కాలి వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఏప్రిల్ 4వ తేదీన నేరుగా నెట్ ఫిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర దర్శక నిర్మాత శశికాంత్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. టెస్ట్ చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన కథా చిత్రమే కాదని, ఈ కథలో క్రికెట్ క్రీడకు సంబంధించిన పలు అంశాలు చోటు చేసుకుంటారని చెప్పారు. ఇది ముగ్గురు జీవితాలకు సంబంధించిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర కథను తాను 12 సంవత్సరాల క్రితమే తయారు చేసుకున్నానని చెప్పారు. అయితే పలు చిత్రాలు నిర్మాణంలో ఉండడం వల్ల ఈ కథను తెరకెక్కించడానికి సమయం పట్టిందన్నారు. అయితే కరోనా సమయంలో టెస్ట్ చిత్రాన్ని రూపొందించడానికి ఇదే సరైన తరుణం అని భావించానన్నారు. ఈ చిత్ర కథలు అనుకున్నప్పటి నుంచి నటుడు సిద్ధార్థ తనతో ట్రావెల్ అయ్యారన్నారు అదేవిధంగా మరో మాట చెప్పకుండా నటించటానికి అంగీకరించారన్నారు ఇక నటుడు మాధవన్ మాత్రం కథను మరింతగా అప్డేట్ చేయడానికి పుష్ చేశారని చెప్పారు. నటి మీరాజాస్మిన్ ది అద్భుతమైన పాత్ర అని పేర్కొన్నారు. దర్శకుడుగా తన తొలి చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీ లో స్ట్రీమింగ్ చేయడానికి కారణం ఏంటని అడుగుతున్నారని, దట్ ఫిక్స్ ఓటిటి ప్లాట్ఫామ్ గ్లోబల్ స్థాయిలో రీచ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు నెట్‌ఫ్లిక్స్ సంస్థతో 9 ఏళ్ల అనుబంధం ఉందని, టెస్ట్ చిత్రాన్ని ఆ సంస్థ నిర్వాహకులు తొలగించి ఫాలో అవుతున్నారని ,అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చిత్ర షూటింగులు మూడు నెలల్లో పూర్తి చేసినట్లు, అయితే అంతకుముందు ఆరు నెలలు చేసినట్లు చెప్పారు. ఇందులో డ్రామా పోర్షన్‌కు డబ్బింగ్ చెప్పించలేదని, లైవ్ షూటింగ్లో షూట్ చేసినట్లు చెప్పారు. ఈ చిత్రం దర్శకుడిగా తనకు చాలెంజ్ నని అయితే దర్శకుడుగా తనను తాను సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్‌కు రెడీ అయినట్లు శశికాంత్ తెలిపారు.
టెస్ట్ క్రీడా కథా చిత్రం మాత్రమే కాదు
Comments
Please login to add a commentAdd a comment