సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు | - | Sakshi
Sakshi News home page

సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు

Published Sun, Mar 16 2025 2:01 AM | Last Updated on Sun, Mar 16 2025 1:56 AM

సీఈపీ

సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు

సాక్షి, చైన్నె: సీఈపీటీ విశ్వవిద్యాలయం వేసవి – 2025 కోర్సులను ప్రకటించింది ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులకు సాంప్రదాయ తరగతి గదికి మించి విస్తరించే వైవిధ్యమైన, ఇంటెన్సివ్‌, సుసంపన్నమైన విద్యా అనుభవాలను ఈ కోర్సుల ద్వారా అందించనున్నామని ఆ వర్సిటీ డిప్యూటీ ప్రోవోస్ట్‌ (అకాడమిక్‌) ప్రొఫెసర్‌ చిరాయు భట్‌ తెలిపారు. ఈ కోర్సుల వివరాలను శనివారం స్థానికంగా ఆయన ప్రకటించారు. యూరోపియన్‌ విద్యా వ్యవస్థలలో ప్రముఖంగా ఉన్న సమ్మర్‌ అండ్‌ వింటర్‌ స్కూల్స్‌ ఇన్‌ ఇండియా అనే అంశంతో సీఈపీటీ విశ్వవిద్యాలయం ముందుకెళ్తోందన్నారు. సమ్మర్‌ అండ్‌ వింటర్‌ లలో రెండు నుండి నాలుగు వారాల ఇంటెన్సివ్‌ కోర్సులను అందిస్తామన్నారు. ఇవి విద్యార్థులకు గణనీయమైన ఇంటర్‌ డిసిప్లినరీ లెర్నింగ్‌ అవకాశాలను అందిస్తాయన్నారు. విద్యార్థులు భారతదేశంలో, అంతర్జాతీయంగా క్యాంపస్‌, ఆన్‌లైన్‌, ప్రయాణ ఆధారిత ఎంపికలు సహా సుమారు 50 విభిన్న కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు అని వివరించారు. విద్యార్థులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సులు రూపొందించబడిందన్నారు. పీర్‌ లెర్నింగ్‌ ద్వారా, వారు విభిన్న దృక్పథాలను పొందుతారని, క్రెడిట్‌లను సేకరించడం ద్వారా, వారు వారి విద్యాపరమైన సౌలభ్యాన్ని పెంచుకుంటారని పేర్కొన్నారు. తమ కోర్సులలోని ఇంటర్‌ డిసిప్లినరీ స్వభావం విద్యార్థులు కొత్త రంగాలను అన్వేషించడానికి, వారి మేధో పరిధులను విస్తరించడానికి దోహద పడుతుందన్నారు. అదే సమయంలో వినూత్న బోధనా పద్ధతులను అందిస్తుందన్నారు.

క్రికెట్‌ పోటీలు

సాక్షి, చైన్నె: చైన్నె ప్రెస్‌క్లబ్‌, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ సంయుక్తంగా చైన్నెలో క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తోంది. శనివారం ఈ పోటీలను తమిళాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి స్వామినాథన్‌ ప్రారంభించి, కాసేపు సరదాగా క్రికెట్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ తరఫున అధికారులు సుధాకర్‌, వెట్రిసెల్వన్‌, మురళి, రాజశేఖర్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు సురేష్‌ వేదనాయగం, ఆసిఫ్‌, మణికంఠన్‌, మదన్‌, సుందరభారతి పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల

ఉత్పత్తిలో అగ్రగామి

– కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌

తిరువళ్లూరు: ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి హబ్‌గా తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో వుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ సమాచార సాంకేతిక పరిజ్ఞానం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. తిరువళ్లూరు జిల్లా కన్నూరులో రూ.1200 కోట్ల వ్యయంతో జెట్‌వర్క్‌ కొత్త అత్యాధునిక ప్లాంట్‌ను 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 2వేల మందికి ఉపాధి లభించనుంది. కొత్త ప్లాంట్‌ను ప్రారంభించే కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌ హాజరై ప్రారంబించారు. మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా వుండడంతోనే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కోయంబత్తూరులో సెజ్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, పరిశ్రమలు పెట్టడానికి తమిళనాడు అనువైన రాష్ట్రంగా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారని వివరించారు. దేశంలో 500 బిలియన్‌ ఈఎస్‌డీఎం మార్కెట్‌ ఉత్పత్తుల లక్ష్యాన్ని చేరాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులో ట్రిలియన్‌ ఉత్పత్తుల మార్కెట్‌కు దోహదం చేస్తుందన్నారు. మంత్రి అశ్వినీవైష్ణవ్‌ మాట్లాడుతూ తమిళనాడులో పిల్లైపాక్కం, మనలూరు ప్రాంతాల్లో భారీ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ యూనిట్లను స్థాపించడానికి పీఎం సహకారం అందించారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కృష్ణన్‌, ఐసీఈఏ అధ్యక్షుడు పంజాజ్‌ మోహింద్రూ, అరుణ్‌రాయ్‌, సంస్థ నిర్వాహకులు అమృత్‌ ఆచార్య పాల్గొన్నారు.

గంజాయి కేసులో వ్యాపారి అరెస్ట్‌

తిరువొత్తియూరు: తూత్తుకుడి తాళముత్తునగర్‌ ప్రాంతంలో స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళుతున్న సెల్వేంద్రన్‌ (57)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 5 గంజాయి కేసులు ఉన్నట్లు తెలిసింది. అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 3.5 కిలోల గంజాయిని గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సీఈపీటీ వర్సిటీలో  వేసవి కోర్సులు  1
1/1

సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement