పుదుచ్చేరిలో మహిళకు వరాలు
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి సీఎం రంగస్వామి మహిళలకు అసెంబ్లీ వేదికగా బుధవారం వరాలు కురిపించారు. పసుపు వర్ణ రేషన్ కార్డు(కుటుంబ కార్డు) కలిగిన కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు రూ.1000, రెడ్ కార్డు కలిగిన కుటుంబాల్లోని వారికి రూ.2,500 నగదు ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించారు. అలాగే, ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీకి ఆదేశించారు.
కుమారుడు మృతిచెందాడని తల్లి ఆత్మహత్య
తిరువొత్తియూరు: ఈరోడ్‌లో కుమారుడు మృతి చెందిన దుఃఖంలో ఉన్నటువంటి తల్లి ఆవేదనతో విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ కరుంగల్ పాలయం కమలానగర్‌కు చెందిన మాధవన్ కూలీ. ఇతని భార్య అమ్ములు (42) వీరికి ఇద్దరు కుమార్తెలు, చెల్లదురై అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు వివాహమై భర్తతో నివాసం ఉంటుంది. ఇక చిన్న కుమార్తె పాలకాటులో ఉన్న ఒక పాఠశాలలో 10 వతరగతి చదువుతోంది. చెల్లదురై 12వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత కాకపోవడంతో అతను గత జనవరి నెల 24వ తేదీ చెల్లదురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం మాధయ్యన్ పూందురై కట్టడ పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అమ్ములు హఠాత్తుగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో కుమారుడు మృతి చెందిన దుఃఖంలో అమ్ములు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియ వచ్చింది.
ఇంటి తాళం పగులగొట్టి చోరీ
●వ్యక్తి అరెస్టు, 35 సవర్ల బంగారం స్వాదీనం
కొరుక్కుపేట: చైన్నెలోని చూలైమేడులో ఓ ఇంటి తాళం పగులగొట్టి డబ్బు, బంగారు నగలు దోచుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 35 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు చూలైమేడు గిల్ నగర్‌కు చెందిన వెంకట సుబ్రమణియన్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 15న ఇంటికి తాళం వేసి ఉదయం 10.30 గంటలకు నుంగంబాక్కం, అక్కడి నుంచి టి.నగర్ వెళ్లి తిరిగి మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడం చూసి షాక్ అయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న నగదుతోపాటు బంగారం చోరీ చేసినట్టు గుర్తించారు. ఎఫ్–5 చూలైమేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల రికార్డింగ్‌లను నిరంతరం పరిశీలించి ఈ కేసుకు సంబంధించి వెస్ట్ మాంబలం లక్ష్మీపురం డాక్టర్ అంబేడ్కర్ వీధికి చెందిన విజయకుమార్ కుమారుడు విక్కీని బుధవారం అరెస్టు చేశారు. నేరానిఇన అంగీకరించాడు. అతని నుంచి 35 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
అన్నానగర్: పొల్లాచ్చి సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ఓ ఇంట్లోకి అదుపుతప్పి ఓ కారు దూసుకెళ్లింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పొల్లాచ్చి సమీపంలోని మాకినంబట్టి మీదుగా మంగళవారం రాత్రి ఓ కారు వేగంగా వెళుతోంది. కారు రోడ్డు మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు ఓ ఇంటి లోపలికి దూసుకెళ్లింది. ఇంటి ప్రహరీ గోడ గోడ కూలిపోయింది. తర్వాత ప్రమాదానికి కారణమైన కారులో వచ్చిన ముగ్గురిని ఆ ప్రాంత ప్రజలు పట్టుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పుదుచ్చేరిలో మహిళకు వరాలు
Comments
Please login to add a commentAdd a comment