ప్రేమను నిరాకరించిన బాలిక ..కిరోసిన్ పోసి దహనం
● ఇద్దరు యువకుల అరెస్టు
అన్నానగర్: తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని ఇనంబువనం గ్రామానికి చెందిన ఓ మహి ళకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 17 ఏళ్ల కుమార్తె అదే ప్రాంతానికి చెందిన సంతోష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు వ్యతిరేకత తెలుపడంతో 17 ఏళ్ల అమ్మాయి సంతోష్‌తో మనమిద్దరం స్నేహితులుగా ఉంటామని చెప్పింది. కానీ సంతోష్ అందుకు అంగీకరించకపోవడంతో బాలికను ప్రేమించమని చెప్పి చిత్రహింసలకు గురిచేశాడు. ఆ తర్వాత ఆగస్టు2, 2024న బాలిక తల్లి సంతోష్‌పై పరమకుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో దూషిస్తూ బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పరమకుడి పోలీసులు ఇరువర్గాలను పిలిపించి విచారణ జరిపి కేసును ముగించారు. ఈ స్థితిలో బుధవారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లిన సంతోష్ తనను ప్రేమించమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశం చెందిన సంతోష్ తన స్నేహితుడు ముత్తయతో కలిసి బాలిక పై కిరోసిన్ పోసి మంటలు అంటించి పరార య్యారు. స్థానికులు గాయపడ్డ బాలికను తూత్తుక్కుడి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అనంతరం సంతోష్, ముత్తయాన్‌ను అరెస్టు చేశారు.