
అభివృద్ధి పనుల తనిఖీ
తిరువళ్లూరు: పొన్నేరి తాలుకా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో కలెక్టర్ ప్రతాప్, తాహశీల్దార్ సోమసుందరంతో పాటూ ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొదట స్థానికంగా వున్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ విద్యార్దులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి చిన్నారుల హాజరు వివరాలను సేకరించారు. తర్వాత ఇటీవల నిర్మించిన రోడ్డు నాణ్యతను పరిశీలించారు. అలాగే పళవేర్కాడు చెరువులోని ముఖద్వారం వద్ద సుమారు రూ.26.85 కోట్లు వ్యయంతో జరుగుతున్న వేర్వేరు పనులను కలెక్టర్ పరిశీలించారు. పళవేర్కాడు చెరువులో 325 మీటర్లు దూరంతో నిర్మిస్తున్న అడ్డుగోడ, 4 కిమీ మేరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం, ముఖద్వారం వద్ద పూడిక తీత పనులను సైతం పరిశీలించి సూచనలు చేశారు. అలాగే పొన్నేరి బస్టాండులోని టీ దుకాణంలో పరిశుభ్రత లేకపోవడంతో దానికి సీల్ వేయాలని ఆదేశించారు.