●క్యాన్సర్‌పై అవగాహన
కారు ప్రమాదంలో
మహిళ మృతి
అన్నానగర్: దిండుగల్ జిల్లా వడమదురైలోని చిత్తూరు ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(22) కళాశాల విద్యార్థిని. ఈమె వడమదురైకి చెందిన నందకుమార్(23) గత ఒక సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పళని మురుగన్ ఆలయానికి వెళ్లి ఒడ్డంఛత్రం సమీపంలోని చత్రపట్టి పశువుల మార్గం ప్రాంతానికి సోమవారం కారులో వస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా కారు అదుపు తప్పింది. నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో బోల్తా పడి ప్రమాదానికి గురైంది. భువనేశ్వరి తలకు తీవ్ర గాయాలు ఏర్పడి, ఆమె ప్రియుడి కళ్లముందే అక్కడికక్కడే మరణించింది. నందకుమార్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


