సదరన్ రైల్వేలో డిజిటల్ టికెట్ పద్ధతి
కొరుక్కుపేట: డిజిటల్ టిక్కెట్లను ప్రోత్సహించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం ఒక ముఖ్య చర్యగా సదరన్ రైల్వే చైన్నెలోని డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్‌లో ఎంఅండ్ యూటీఎస్ సహాయక్ పథకాన్ని ప్రారంభించింది. మొబైల్ ఫోన్‌లు, బ్లూటూత్ సదుపాయం కలిగిన ప్రింటర్‌లతో కూడిన శిక్షణ పొందిన సహాయక్‌లు, టిక్కెట్ కౌంటర్‌లకు సమీపంలో ప్రయాణికులకు ఈ డిజిటల్ విధానంలో టిక్కెట్లను అందిస్తారు . ఇది ప్రయాణికులకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణ సరళతను అందిస్తుంది. చైన్నె సెంట్రల్ స్టేషన్‌లో పథకం అమలు చేయబడిందని అధికారులు తెలిపారు. ఈ విధానంతో టిక్కెట్ల కౌంటర్లలో బారులు తీరిన వరుసలను తగ్గించడం, టిక్కెట్ల ప్రక్రియను విరివిగా చేయడం, ప్రయాణికుల సంతృప్తిని మెరుగు పరుస్తుందని వెల్లడించారు.


