సాక్షి, మంచిర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే, జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. మంచిర్యాల జిల్లా డిమాండ్ చాలా కాలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.. అందుకే మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశాం. పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇబ్బంది లేకుండా అందాలి. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారు. కరోనా అతలాకుతలం చేసినా కోలుకున్నాం. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన అధికారులకు కృతజ్ఞతలు.
తెలంగాణ అనేక అంశాల్లో నెంబర్ వన్‌గా ఉంది. కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగాం. వరి సాగులో పంజాబ్‌ను దాటేసి నెంబర్ వన్‌గా ఉన్నాం. కంటి వెలుగు పథకం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగును కొనసాగిస్తామన్నారు. కుల వృత్తులను ఆదుకునేందుకు చేయూత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు!
Comments
Please login to add a commentAdd a comment