Collecterate Office
-
ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్ చేసిన పోలీసులు..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో, ఖమ్మం కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపే అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఇక, కలెక్టరేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్శదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వాలు ఉద్యోగుల కాళ్ల వద్దకు వస్తున్నాయి. రైతుకు ఆ పరిస్థితి లేదు. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తాం. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయి. వద్దన్న రోడ్లు వేస్తున్నారు.. కావాలన్న రోడ్లు వేయడం లేదు. బీఆర్ఎస్కు మేము చెబితే వినే పరిస్థితి లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులది చట్టబద్దమైన పోరాటం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. రైతులు చూపిన త్యాగం, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుంది. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాటం. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉంది. తక్కువ నష్టం అయ్యే భూమినే ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. మార్కెట్ విలువకు 3 రెట్లు ఎక్కువ కట్టించి రైతులకు ఇవ్వాలి. 2016లో భూసేకరణ చట్ట ప్రకారం రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ.. రెచ్చిపోయిన ఇరువర్గాలు -
మంచిర్యాల: కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. మంచిర్యాల జిల్లా డిమాండ్ చాలా కాలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.. అందుకే మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశాం. పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇబ్బంది లేకుండా అందాలి. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారు. కరోనా అతలాకుతలం చేసినా కోలుకున్నాం. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన అధికారులకు కృతజ్ఞతలు. తెలంగాణ అనేక అంశాల్లో నెంబర్ వన్‌గా ఉంది. కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగాం. వరి సాగులో పంజాబ్‌ను దాటేసి నెంబర్ వన్‌గా ఉన్నాం. కంటి వెలుగు పథకం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగును కొనసాగిస్తామన్నారు. కుల వృత్తులను ఆదుకునేందుకు చేయూత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ లొల్లి
సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా.. బాధితులు శుక్రవారం ఆందోళన నిర్వ హించారు. సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర చేశారు. అనంతరం కలెక్టర్ ఎదుట రెండుగంటలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల డ్రాలోనూ కొందరు అనర్హులకు దక్కాయని ఆరోపించారు. -
కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: జిల్లా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు చికిత్సి పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నార్పల మండలం గూగూడుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా పొదుపు సంఘంలో తన తల్లికి రావాల్సిన డబ్బు అందలేదన్న మనస్తాపంతో రాజశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
అట్టుడికిన కలెక్టరేట్
- అఖిల పక్షం ఆధ్వర్యంలో ముట్టడి విజయవంతం - నాయకులను అరెస్టు చేసిన పోలీసులు - కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు అనంతపురం: మున్సిపల్ కార్మికులను కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ముట్డడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఆందోళనలో పాల్గొనడంతో కలెక్టరేట్ కార్యాలయం అట్టుడికిపోయింది. సీఐలు శుభకుమార్, రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐలు కె. వెంకటరమణ, నాగమధు, క్రాంతికుమార్, రఫీక్, జీటీ నాయుడు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడి సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఆందోళనకారులు కలెక్టరేట్ గేటును తోసుకుని కార్యాలయంలోకి చొచ్చుకుపోయి.. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముట్టడి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సీపీఐ నాయకులు జాఫర్, ఏఐటీయూసి నాయకులు కె.రాజారెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఓబుళ, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాంభూపాల్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఆందోళనకారులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డౌన్..డౌన్.. మంత్రి నారాయణ ఖబర్దార్ అంటూ.. నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూవజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.రాజీవ్‌రెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి, సీపీఎం కార్పొరేటర్ భూలక్ష్మి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనరాజారెడ్డి, వైఎస్సార్సీపీ లారీ అసోసియేషన్ నాయకలు రంగ, విశ్వనాథ్‌రెడ్డి, పీరా, జేఎం బాషా, రిలాక్స్ నాగరాజు, భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు గౌసుల లక్ష్మన్న, నారాయణస్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బీసీఆర్ దాస్, మున్సిపల్ కార్మిక జేఏసీ నాయకలు గోపాల్, పెన్నోబులేసు, నరసింహులు, పెద్దన్న, ఆటో యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, సీపీఎం నాయకులు వలి, రాంరెడ్డి, నాగరాజు, నల్లప్ప, కే.వీరన్న, వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘కాకతీయ’ అక్రమాలకు అధికారులదే బాధ్యత
రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే... అంతే పత్రికల్లో వచ్చే వార్తలకు వెంటనే స్పందించాల్సిందే అధికారులకు మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో అక్రమాలు జరిగితే అధికారులనే బాధ్యులని చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధుల ఫోన్ల ఒత్తిడికి లొంగిపోయామని అధికారులు చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల అమలు తీరుపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈటెల మాట్లాడారు. ఎంతో పవిత్ర ఆశయంతో రూపొందించిన మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో కరీంనగర్ జిల్లా బాగా వెనుకబడి ఉందన్నారు. జూన్‌లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా చాలాచోట్ల పనులు ప్రారంభమే కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వార్ధం, బద్దకంతో వ్యవహరించే అధికారుల తీరుతోనే ఇలా జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోతే ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ అక్రమాలకు సంబంధించి పత్రికల్లో వచ్చే వార్తలకు ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అంచనాల్లో 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేయడం పట్ల సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘అధికారుల అంచనా కంటే 35 శాతం వరకు తక్కువగా టెండర్ వేస్తే పనుల్లో నాణ్యతైనా లోపిస్తుంది... లేదంటే అధికారులే అంచనాలను అమాంతంగా పెంచి ఉండాలి. అంతే తప్ప పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయే ప్రసక్తే ఉండదు’ అని అన్నారు. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల్లోని మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికమంత్రి నియోజకవర్గంలోనే ఇది జరుగుతున్నట్లు పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో మట్టిని అమ్ముకునే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సమీక్ష జరిపానని ఈటెల తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ ఫారెస్ట్, రెవెన్యూ అధికారులెవరూ చెరువులవైపు ముఖం కూడా చూపడం లేదని, పనులు ప్రారంభించిన తాము మాత్రం ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి 9 గంటల విద్యుత్ వచ్చే ఏడాది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కెపాసిటీ పెరిగే అవకాశమున్నందున అందుకు తగినట్లుగా సబ్స్టేషన్లు ఉన్నాయా? అనే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ నాగేంద్ర, అధికారులు పాల్గొన్నారు.