సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 60.1 శాతం పెద్దల్లో కరోనా వైరస్‌కు విరుగుడుగా యాంటీబాడీలు తయారైన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ప్రకటించింది. పిల్లల్లో ఇది 55 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కౌమార వయస్కుల విషయానికి వస్తే 61 శాతం మంది, ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం మందిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని వివరించింది. అయితే వారిలో చాలా మంది టీకాలు వేయించుకుని ఉండ టం కూడా ఎక్కువ శాతం మందిలో యాం టీబాడీల ఉండేందుకు కారణమై ఉండొచ్చని అభి ప్రాయపడింది. ఈ మేరకు నాలుగో విడత సెరో సర్వే వివరాలను ప్రకటించింది.
క్రమంగా పెరుగుదల...
కరోనా వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో భాగంగా ఐసీఎంఆర్ ఒకే ప్రాంతంలో పలు దఫా లుగా సెరో సర్వే నిర్వహించింది. తొలి సర్వే గతే డాది మేలో జరగ్గా రెండు, మూడు సర్వేలు ఆగస్టు, డిసెం బర్‌లలో చేపట్టింది. తాజాగా ఈ ఏడాది జూన్‌లో నాలుగో సర్వే జరిగింది. తొలి మూడు సర్వేల్లో పాజిటివిటి వరుసగా 0.33 శాతం, 12.5 శాతం, 24.1 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో సెరో పాజిటివిటీ గతేడాది డిసెంబర్ నాటికి 24 శాతం ఉంటే ఈ ఏడాది జూన్‌కు అది 67 శాతానికి ఎగబాకింది. ఇదే కాలానికి తెలంగాణలో కొంచెం తక్కువగా (24 శాతం నుంచి 60.1 శాతం) ఉం డటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలో టీకాలు వేయించుకోని వారిలోనూ సెరో పాజిటివిటీ 51.3 శాతంగా ఉండటం. ఒక డోసు తీసుకున్న వారిలో ఇది 78.5 శాతం ఉండగా రెండో డోసూ పూర్తి చేసుకున్న వారిలో 94 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment