
సాక్షి, హైదరాబాద్: మార్చి చివరి నాటికే ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. మంగళవారం ఆదిలాబాద్‌లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీలు రికార్డయింది. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 2.6 డిగ్రీలు, మెదక్ 2.5 డిగ్రీలు, రామగుండం 2.4 డిగ్రీలు నమోదైంది.
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయని.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితేంటని ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ ఒకట్రెండు తేదీల్లో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.