
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా సంస్థ నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. శుక్రవారం తొలి విమానం ఎఐ–147 టేకాఫ్ తీసుకుంది. ప్రతి శుక్ర, సోమవారాలు ఇక్కడి నుంచి లండన్ హిత్రూ విమానాశ్రయానికి విమానాలు బయలుదేరుతాయి. ఇప్పటికే బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి లండన్‌కు విమాన సర్వీసులు కొనసాగిస్తోంది. ఎయిర్ ఇండియా సర్వీసుతో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యం కలిగిందని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గెయిల్, ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment