సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావును కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. హెల్త్ కార్డుల అమలులో ఎదురౌతు న్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, మీడియా అకాడమీ చైర్మన్‌తో పాటు, జర్నలిస్టు ప్రతినిధులను కూడా పిలిచి త్వరలో చర్చిస్తామన్నారు. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు సూరజ్ భరద్వాజ్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment