సాక్షి, వికారాబాద్: జిల్లాలో కొత్తరకం వైరస్ మూగ జీవుల ఉసురు తీస్తోంది. ఈ మహమ్మారి ఎంటో వైద్యులకు కూడా అంతుచిక్కకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పశువుల చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు పడి రక్తం కారుతుండటంతో వాటిని ముట్టుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300 పైగా పశువులకు ఈ వింత రోగం సోకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ మాయదారి మహమ్మారి నుంచి పశువులను రక్షించుకునేందుకు రైతులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో వేలకు వేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. ఇక ఇది రోగమా? వైరస్ అనేది తెలియక పశువైద్యులు పరెషాన్ అవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు పశువులకు గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చి సరిపెడుతున్నారు. అయితే ఈ మాయదారి రోగం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు పశు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment