సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు.
మంత్రి ఈటలకు బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి
Published Mon, Dec 14 2020 9:02 AM | Last Updated on Mon, Dec 14 2020 9:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment