సాక్షి, బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు ప్రత్యేకమైన రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు కొత్త సంవత్సరం నుంచి జూ సందర్శకులను అలరించనున్నాయి. జూపార్కు వ్యవస్థాపక దినమైన అక్టోబర్ 6న కునాల్, దివ్యానీ దంపతులకు నాలుగు పులి కూనలు జన్మించాయి. వాటిని కలుపుకొని జూలో మొత్తం 14 రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ఉన్నాయి. ఇందులో మగవి ఆరు, ఆడవి మూడు ఉన్నాయి. జూపార్కులో చేపట్టిన సంతానోత్పత్తిలో పుట్టిన ఈ పులులకు జూ అధికారులు, అటవీ శాఖ మంత్రులు పేర్లు పె ట్టారు. జూలో తెల్ల పులుల పేర్లు నాగమణి, కవి, సమీరా, అభిమన్యు, శంకర్ పేర్లు పెట్టారు. మన దేశంలో రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ప్రత్యేకమైనవి. ఇతర దేశాల్లో ఇవి అరుదు.
Comments
Please login to add a commentAdd a comment