
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్‌లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది.