
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని గార్ల మండలంలో ఓ ప్రియురాలు ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకుంటానని యువతి రజినీకి మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడు శ్రీనాథ్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రోజున ఓ కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. దీంతో ప్రియురాలు రజినీ పెళ్లి మండపం వద్దకు వెళ్లి తనును ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు తరపు బంధువులు ప్రియురాలిని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కల్యాణ మండపంలోనే విచక్షణారహితంగా దాడి చేశారు.
అయితే అక్కడే వున్న కానిస్టేబుల్ కనీసం ప్రయత్నం చేయలేదని రజినీ ఆవేదన వ్యక్తం చేసింది శ్రీనాథ్ తాను మూడేళ్ల నుంచి ప్రేమించు కుంటున్నామని, పెళ్లి విషయం గురించి అడిగే సరికి మొహం చాటేశారని చెబుతోంది.
చదవండి: (ఈత.. కడుపుకోత! నీట మునిగితే కష్టమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి)
Comments
Please login to add a commentAdd a comment