
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి పువ్వాడ కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పువ్వాడను ఆదేశించిన సీఎం కేసీఆర్.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నేపథ్యంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చగా.. ఓ గుడిసెకు నిప్పంటుకోవడం, మంటల్ని చల్లార్చేందుకు వెళ్లి అందులోని గ్యాస్ సిలిండర్ గమనించకపోవడం, ఆపై భారీ పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment