వరంగల్: నా గొంతులో ప్రాణమున్నంత వరకు మంత్రి రామన్న చెయ్యిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రమాణం చేశారు. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట సెయింట్ గాబ్రియల్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం రాత్రి ఐటీ, మున్సి పల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నానన్నారు.
తనను పిలిచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలంగాణ జాతిపిత సీఎం కేసిఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన ప్రజాప్రతినిధి జీవితంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పదేళ్ల జీవితం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించలేకపోయానని, సీఎం కేసీఆర్, మంత్రి రామన్నల సహకారంతో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్న వరంగల్ పశ్చిమ ప్రాంతానికి వీలైనంత మేరకు నిధులను మంజూరు చేయిస్తున్నామన్నారు.
బలగం లాంటి తన కార్యకర్తల సహకారంతో వారిచి్చన స్ఫూర్తి, ధైర్యంతో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులను చేయిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.78 కోట్లతో ఫాతిమానగర్‌లో చేపట్టిన ఫ్‌లైఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని ప్రజలు గుర్తించాలని కోరారు. మంత్రి రామన్న సహకారంతో హనుమకొండ జిల్లాకు 4 అతిపెద్ద ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని, వీటిలో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మతతత్వంతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్న బీజేపి నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాధించిన నిధులు శూన్యమని, వరంగల్ భద్రకాళీ ఆలయం మాడవీధుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మాజీ ఎంపీ వొడితెల కెప్టెన్ లక్షి్మకాంతారావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, సురభివాణిదేవి, బస్వరాజ్ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సీపీ రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment