ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(BRS) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. ఈ కార్యాలయాన్ని కేంద్ర బిందువుగా మార్చాలని భావిస్తున్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను అంతే ఘనంగా నిర్మించారు.
అయితే ఈ ఫీట్ ద్వారా బీఆర్‌ఎస్ తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఘనత సాధించింది. తెలుగు రాష్ట్రాల తరపున ఢిల్లీలో కేంద్రీయ కార్యాలయం ప్రారంభించిన తొలి పార్టీగా నిలిచింది బీఆర్‌ఎస్. ఇంతదాకా ఏ పార్టీ కూడా ఈ ప్రయత్నమూ చేయలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. నేడు బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆడంబరానికి దూరంగా సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అందుకే రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఇక.. వాస్తు పండితులు సుధాకర్ తేజ, శృంగేరి పీఠం రుత్వికులు గోపి శర్మ, ఫణి శర్మ ఆధ్వర్యంలో క్రతువులు జరగనున్నాయి. మ.1.05 నిమిషాలకు రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభిస్తారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.
BRS Office ప్రత్యేకతలు ఇవే
► 20 వేల చదరపు అడుగులలో జి +3 మూడంతస్తుల భవనం నిర్మాణం
► మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ కార్యాలయం, పేషి కాన్ఫరెన్స్ హాల్
► రెండవ, మూడవ అంతస్థుల్లో బస చేసేందుకు 18 గదుల ఏర్పాటు,
► రెండు ప్రత్యేక సూట్ రూంలు అందులో ఒకటి ప్రెసిడెంట్ సూట్, మరొకటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్
► గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్
ఇదీ చదవండి: తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
Comments
Please login to add a commentAdd a comment