Vasant Vihar
-
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆయన ఆఫీస్ రిబ్బన్‌ను కట్ చేశారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్ విహార్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్ భేటీ అయ్యారు. మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్ గ్రౌండ్లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్‌తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్‌ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్‌లను సిద్ధం చేశారు. సూట్ రూమ్‌లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు. ఆంక్షలతో ఆలస్యం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 2021 సెప్టెంబర్ 2న కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇదీ చదవండి: ‘బీజేపీని తరిమికొట్టే టైం వచ్చింది’ -
బీఆర్ఎస్ ఖాతాలో అరుదైన ఘనత
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(BRS) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. ఈ కార్యాలయాన్ని కేంద్ర బిందువుగా మార్చాలని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఆఫీస్‌ను అంతే ఘనంగా నిర్మించారు. అయితే ఈ ఫీట్ ద్వారా బీఆర్ఎస్ తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఘనత సాధించింది. తెలుగు రాష్ట్రాల తరపున ఢిల్లీలో కేంద్రీయ కార్యాలయం ప్రారంభించిన తొలి పార్టీగా నిలిచింది బీఆర్ఎస్. ఇంతదాకా ఏ పార్టీ కూడా ఈ ప్రయత్నమూ చేయలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నేడు బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆడంబరానికి దూరంగా సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అందుకే రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఇక.. వాస్తు పండితులు సుధాకర్ తేజ, శృంగేరి పీఠం రుత్వికులు గోపి శర్మ, ఫణి శర్మ ఆధ్వర్యంలో క్రతువులు జరగనున్నాయి. మ.1.05 నిమిషాలకు రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభిస్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. BRS Office ప్రత్యేకతలు ఇవే ► 20 వేల చదరపు అడుగులలో జి +3 మూడంతస్తుల భవనం నిర్మాణం ► మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ కార్యాలయం, పేషి కాన్ఫరెన్స్ హాల్ ► రెండవ, మూడవ అంతస్థుల్లో బస చేసేందుకు 18 గదుల ఏర్పాటు, ► రెండు ప్రత్యేక సూట్ రూంలు అందులో ఒకటి ప్రెసిడెంట్ సూట్, మరొకటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ ► గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ఇదీ చదవండి: తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం -
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అత్యాధునిక హంగులతో వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన రేపు(గురువారం) ప్రారంభించనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఇప్పటికే పార్టీ ఆఫీస్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా యాగం, హోమం, ఇతర పూజ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం అవుతారని తెలుస్తోంది. రేపు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. గురువారం ఆయన ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఈ మధ్యలో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: తడిసినా కొంటాం.. రైతన్నకు సీఎం కేసీఆర్ భరోసా -
పోలీసులను చూసి భవనం పైనుంచి దూకేశాడు..
సాక్షి, ఢిల్లీ : పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునే యత్నంలో ఓ వృద్ధుడు(69) భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వసంత్ విహార్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఫైనాన్స్ వ్యాపారం చేసే వీరేంద్ర థింగ్రా ఒకరికి బాకీ పడిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ విషయమై అతనిపై ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులకు దొరక్కుండా వీరేంద్ర గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను సోమవారం వసంత్ విహార్‌లోని తనయుడు సంజయ్ ఇంటికి వచ్చాడు. అతని ఆచూకీ పసిగట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుందామని ఆ ఇంటికి చేరుకున్నారు. కానీ, పోలీసులను చూసి తనను అరెస్టు చేస్తారని భయపడిన థింగ్రా భవనం పైకెక్కి దూకేశాడని పోలీసులు వెల్లడించారు. ‘థింగ్రా ఫైనాన్స్ వ్యాపారి. ఒకరికి డబ్బు చెల్లించడంలో విఫలమవడంతో అతనిపై ఒక చీటింగ్ కేసు నమోదై ఉంది. ఈ విషయమై అతను తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో రాసి ఉంది’ అని సౌత్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ మిలింద్ దుంబెర్ చెప్పారు. సూసైడ్ నోట్లోని చేతిరాత వీరేంద్రదా, కాదా? అనేది తేల్చాల్సివుందని ఆయన చెప్పారు. కానీ, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం వీరేంద్రది హత్యేనని ఆరోపిస్తున్నారు. ‘మా నాన్నను ఎవరో చంపేశారాని నాకొక ఫోన్ కాల్ వచ్చింద’ని థింగ్రా తనయుడు సంజయ్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇంతవరకూ అనుమానితులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. -
జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష
మరొకరి జీవిత ఖైదు ≈ శిక్షలు ఖరారు చేసిన ఢిల్లీ కోర్టు ≈ దోషులకు 9.8 లక్షల జరిమానా ≈ సౌమ్య హత్య కేసులోనూ ≈ వీరే దోషులు న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగిని జిగీష ఘోష్ (28) హత్య కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరికి మరణ శిక్ష , ఒకరికి జీవిత ఖైదును విధించింది. 2009 మార్చి18న దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న తన నివాసం వద్ద నుంచి ఆమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆఫీస్ క్యాబ్ ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లగా అంతలో కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు. 3 రోజులకు సూరజ్‌కుండ్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ కేసులో 2009 జూన్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం రవి క పూర్, బల్జీత్, అమిత్ శుక్లాలను దోషులుగా నిర్ధారించింది. రవి క పూర్, అమిత్శుక్లాలకు మరణశిక్ష, బల్జీత్‌కు జీవిత ఖైదు శిక్షలను ఖరారు చేసింది. రూ.9.8 లక్షల జరిమానా.. ముగ్గురికి రూ. 9.8 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ. 6 లక్షలను బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించింది. జిగీష నుంచి బంగారు గొలుసు, 2 ఫోన్లు, 2 ఉంగరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు దొంగిలించి తర్వాత దారుణంగా హత్య చేశారు. ఆమె డెబిట్ కార్డుతో నిందితులు షాపింగ్ చేశారని సీసీటీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు లభించినట్లు బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. వారు ఇప్పటికే ఏడేళ్లు జైలు జీవితం గడిపారని, వారిపై కనికరం చూపాలని కోర్టును నిందితుల తరఫు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్.. హత్య జరిగే సమయంలో జిగీష తనను చంపవద్దని దోషులను ప్రాధేయపడినట్లు.. కావాలంటే తన వద్ద ఉన్న వస్తువులను తీసుకోమని.. తన డెబిట్ కార్టు పిన్‌నంబర్‌ను సైతం వారికి తెలియపరిచినట్లు వెల్లడించారు. అయినప్పటికీ దోషులు జిగీషను వదల్లేదని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిపై దోషులు అనాగరికంగా, ఆటవికంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై జాలి చూపలేమని తెలిపారు. కాగా, 2008 సెప్టెంబర్‌లో జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసుకేసులోనూ వీరే నిందితులుగా ఉన్నారు. -
మహిళలకు భద్రత అంతంతే : సోనమ్
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో తాజాగా జరిగిన అత్యాచార ఘటనను నటి సోనమ్‌కపూర్ ఖండించింది. మహిళలకు ఢిల్లీకంటే ముంబైలో భద్రత బాగుంటుందని అభిప్రాయపడింది. నగరంలోని వసంత్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఉబర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదవ్ అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. నగరంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోనమ్ ఈ ఘటనపై పైవిధంగా స్పందించింది. ‘ ఈ ఘటన భయానకమైనది. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలకు భద్రత అంతంతే. ఉబర్ సంస్థపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడంపై స్పందిస్తూ ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది క్యాబ్ సంస్థ తప్పు కాదు. ఏరకంగా చూసుకున్నా ఇది సర్కారు తప్పిదమే. ఎందుచేతనంటే సదరు డ్రైవర్‌కు ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చింది’ అని అంది. అందువల్ల శిక్షతోపాటు నిబంధనలు కూడా కఠినతరంగా ఉండాలి’ అని అంది. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన వాహనాల్లో అత్యాచారం జరిగితే వాటిపై కూడా నిషేధం విధించాలా అంటూ మీడియా ప్రశ్నించగా... అలా చేస్తేనే ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నట్టు జవాబిచ్చింది. -
దిగ్గజాల రాజకీయ క్షేత్రంలో కులానిదే బలం!
సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, డిఫెన్స్ కాలనీ వంటి సంపన్న కాలనీలతోపాటు దేవ్లీ వంటి కుగ్రామాలతో కూడిన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం దిగ్గజాలు పోటీపడిన రాజకీయ క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పరాజయాన్ని చవిచూపించి, ఎన్నికల రాజకీయాలంటే ఆయనకు దడ పుట్టించిన నియోజకవర్గమిదే. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ కూడా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. కుల సమీకరణాలకే పెద్దపీట వేసే ఈ నియోజకవర్గంలో కుల సమీకరణాలు 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో మారిపోయాయి. అంతవరకు పంజాబీ, సిక్కు ఓటర్లు అధికంగా ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపేవి. కానీ 2008 తర్వాత నియోజకవర్గంలో జాట్, గుజ్జర్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. దానితో రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యాలను కూడా మార్చాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్ జాట్ కులానికి చెందిన రమేష్ కుమార్‌ను బరిలోకి దింపగా, బీజేపీ గుజ్జర్ కులానికి చెందిన రమేష్ బిధూరీని నిలబెట్టింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు ఈ ఇద్దరికే మళ్లీ టికెట్లను ఇచ్చాయి. మోడీ మేనియాపైనే బీజేపీ ఆశలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో రమేష్ కుమార్‌ను కాకుండా మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న కాంగ్రెస్ ఆఖరి క్షణంలో మళ్లీ ఆయనకే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ముక్కోణపు పోరు జరిగినప్పటికీ దక్షిణ ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే అధిక మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ఏడింటిని బీజేపీ దక్కించుకుంది. దీంతో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం తనదే అన్న ధీమాతో ఉంది. అందుకే గత లోక్‌సభ ఎన్నికలలో 93 వేల ఓట్ల తేడాతో రమేష్ కుమార్ చేతిలో ఓడిపోయిన రమేష్ బిధూరీకే మళ్లీ టికెట్ ఇచ్చింది. రమేష్ బిధూరీ తుగ్లకాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసన భ్యునిగా ఎన్నికయ్యారు. గుజ్జర్ ఓట్లతో పాటు నరేంద్ర మోడీ చరిష్మా బిధూరీని గెలిపిస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జాట్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల జాట్ ఓట్లు చీలవచ్చని, అదీకాక ముజఫర్‌నగర్ అల్లర్ల ప్రభావం వల్ల జాట్ ఓటర్లు తమకు మద్దతు ఇవ్వవచ్చని బీజేపీ ఆశిస్తోంది. ఆప్నే గెలిపిస్తారు: సెహ్రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండింటి ఓటు బ్యాంకును కొల్లగొట్టి మూడు సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ దేవేంద్ర సెహ్రావత్‌కు టికెట్ ఇచ్చింది. రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర సె్రహావత్ మహిపాల్‌పూర్‌కు చెందిన జాట్ నాయకుడు. ఐదారు సంవత్సరాలుగా స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామపంచాయతీ స్థలాన్ని స్వాధీనపర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దక్షిణ ఢిల్లీలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి జలాశయాలను సంరక్షించాలని ప్రచారోద్యమం జరిపారు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి మారిపోయిందని, అప్పట్లో ఆప్ అంటే తెలియక చాలా మంది ఓటర్లు ఆప్‌కు ఓటేయలేదని, ఇప్పుడు ప్రజల మద్దతు తనకు ఉందని సెహ్రావత్ అంటున్నారు. కుల సమీకరణాల కన్నా ప్రజా సమస్యలు ఎన్నికల్లో అధిక ప్రభావం చూపుతాయని ఆయన అంటున్నారు. నీటి ఎద్దడి ఇక్కడి ప్రధాన సమస్య. ట్యాంకర్ మాఫియాను ఎదుర్కొనే సాహసాన్ని ఆప్ సర్కారు చూపిందని, అందువల్ల కులసమీకరణాలు ఎలా ఉన్నా ఓట్లు తనకే అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండేసి రోజులు గడిపి, స్థానికుల సమస్యలను తెలుసుకునే లా వ్యూహం రూపొందించిన ట్లు ఆయన చెప్పారు.