మహిళలకు భద్రత అంతంతే : సోనమ్
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో తాజాగా జరిగిన అత్యాచార ఘటనను నటి సోనమ్‌కపూర్ ఖండించింది. మహిళలకు ఢిల్లీకంటే ముంబైలో భద్రత బాగుంటుందని అభిప్రాయపడింది. నగరంలోని వసంత్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఉబర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదవ్ అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. నగరంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోనమ్ ఈ ఘటనపై పైవిధంగా స్పందించింది. ‘ ఈ ఘటన భయానకమైనది.
ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలకు భద్రత అంతంతే. ఉబర్ సంస్థపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించడంపై స్పందిస్తూ ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది క్యాబ్ సంస్థ తప్పు కాదు. ఏరకంగా చూసుకున్నా ఇది సర్కారు తప్పిదమే. ఎందుచేతనంటే సదరు డ్రైవర్‌కు ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చింది’ అని అంది. అందువల్ల శిక్షతోపాటు నిబంధనలు కూడా కఠినతరంగా ఉండాలి’ అని అంది. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన వాహనాల్లో అత్యాచారం జరిగితే వాటిపై కూడా నిషేధం విధించాలా అంటూ మీడియా ప్రశ్నించగా... అలా చేస్తేనే ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నట్టు జవాబిచ్చింది.