
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘కరోనా వైరస్ నుంచి నేర్చుకున్న పాఠాలు–భవిష్యత్ వ్యూహాల’పై మంగళవారం ఉన్నతస్థాయి వెబినార్ జరగనుంది. దీన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగే ఈ వెబినార్‌కు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. 2.05 గంటల నుంచి 2.20 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ‘చాలెంజెస్ ఆఫ్ కోవిడ్–19... మేనేజ్‌మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలకోపన్యాసం చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తన సందేశం ఇస్తారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ రమేష్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
చదవండి: పార్టీ మార్పుపై ఎల్.రమణ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment