సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. ధాన్యం సేకరణపై జాతీయస్థాయిలో ఒకే విధానాన్ని రూపొందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయరంగ నిపుణులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
‘తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు పెట్టించాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. జాతీయస్థాయిలో ఇప్పటివరకు పంటల సేకరణ పాలసీ లేదు. పంజాబ్, హర్యానాలో వంద శాతం ధాన్యం సేకరిస్తున్నారు.
పంజాబ్, హర్యానా తరహాలో తెలంగాణలో ధాన్యం సేకరించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయి. ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో ఒకే విధానాన్ని రూపొందించాలి. వ్యవసాయ రంగ నిపుణులు, సీఎంలతో సమావేశం నిర్వహించాలి’ అని సీఎం కేసీర్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment