
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091 కు చేరింది. తాజాగా ఆరు మంది కరోనా బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 761 కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 1825 మంది కోలుకుని ఆదివారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 82,411 మంది కోవిడ్ పేషంట్లు ఇప్పటివరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,919 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
(చదవండి: నాన్న శవమా.. నాకు వద్దు)
Comments
Please login to add a commentAdd a comment