
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. గడిచిని 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. తాజాగా ఏడుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 744 కు చేరింది. కొత్తగా 1768 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,735 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంంది. రాష్ట్రంలో రికవరీ రేటు 77.29 శాతంగా ఉందని తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ 477, రంగారెడ్డి 201, నిజామాబాద్‌లో 153 నమోదయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(చదవండి: తేమ నియంత్రణతో కరోనా కట్టడి)
Comments
Please login to add a commentAdd a comment