
వరంగల్,పర్వతగిరి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీఏతో పాటు ఇద్దరు గన్‌మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉండే పీఏలు, గన్‌మెన్లు, సహాయకులకు ఈనెల 21న కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు మంత్రి చెప్పారు. వీరందరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారికి పూర్తి కరోనా లక్షణాలు లేకపోవడంతో వైద్యులు అందరినీ వరంగల్ సమీప ప్రాంతంలో 14రోజుల పాటు హోం ఐసోలేషన్ క్వారంటైన్‌కు పంపించినట్లు మంత్రి పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment