
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడో దశ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే రోడ్ మ్యాప్‌ను రూపొందించాయని, ఆ తరహాలో ఇక్కడా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం ఎంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు? తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కట్టడికి చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కరోనా కట్టడి చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు దాఖలు చేసిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలియజేయలేదని, సెరో సరై్వలెన్స్ నివేదికను సమరి్పంచలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వివరాలతో పాటు గతంలో తామిచ్చిన ఆదేశాల అమలుపై స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది.
చదవండి: తస్మాత్ జాగ్రత్త.. చిన్న పిల్లల్లో ఆ వ్యాధులు పెరుగుతున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment