సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గతవారం నుంచి ప్రతిరోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. గడిచిన 24 గంటలలో తెలంగాణలో 1520 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తితోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా నమోదైన కేసుల్లో 40 శాతం ఒమిక్రాన్ బాధితులున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న ఒక్కరోజే 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే థర్డ్‌వేవ్ వచ్చేసినట్లే అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారులు బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు.
ఆక్సిజన్ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రులతో చేరిన వారిలో దగ్గు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు కోటి వరకు హోమ్ ఐసోలేషన్ కిట్‌లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి మరోసారి ఫీవర్ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment