సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొంతకాలంగా తగ్గుముఖం పట్టినా విద్యార్థులను మళ్లీ వణికిస్తోంది. అప్రమత్తమైన విద్యాశాఖ పలు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఎవరికైనా వైరస్ నిర్ధారణ అయితే విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించింది. మరోవైపు టీచర్లందరికీ రెండు డోస్ టీకాలు తప్పనిసరి అని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఓ పాఠశాలతో పాటు శివార్లలోని పాఠశాలలో సైతం విద్యార్థులు, టీచర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు.
బాధిత విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా విద్యాసంస్థల్లో వైరస్ కట్టడి ని బంధనలు మాత్రం అమలు కావడంలేదు. కనీ సం శానిటేషన్, సిట్టింగ్‌లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం నిబంధన కనిపించడం లేదు. ప్రైవేటు యాజమాన్యాలు పట్టించుకోకపోగా, ప్రభు త్వ విద్యాసంస్థలకు నిధులు కొరత వెంటాడుతోంది. వైరస్‌తో భయంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది.
20 శాతం ఆన్‌లైన్‌లోనే..
పాఠశాలలు పునఃప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. థర్డ్‌వేవ్ భయంతో 20 శాతం వరకు పాఠశాలలు ఇంకా ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సెప్టెంబరులో అనూహ్యంగా హైకోర్టు ఆదేశాలతో కొంత బ్రేక్ పడినా.
క్రమంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.. మూడో దశ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ఏంటి.. పాఠశాలలను తెరవడం మంచిది కాదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. బడికి రావాలని విద్యార్థులను బలవంతం చేయకూడదని, ప్రత్యక్ష తరగతులకు హాజరు కానివారిపై చర్యలు తీసుకోవద్దని అప్పట్లో కోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బోధనపై తుది నిర్ణయం పాఠశాలలదేనని పేర్కొంది. క్రమంగా స్కూళ్లు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధన సాగుతున్నా.. తాజాగా బయటపడుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
21.49 లక్షలపైనే...
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు సుమారు 7,587 ఉన్నాయి. వీటిలో దా దాపు 21.49 లక్షలకుపైగా విద్యార్థులున్నారు. వా రం రోజులుగా పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు అక్కడక్కడ కరోనా వైరస్ బారిన పడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గు రవుతున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల హా జరు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
హాజరు ఇలా..
♦హైదరాబాద్ జిల్లాలో పరిధిలోని 2,902 పాఠశాలల్లో మొత్తం 8,72,949 విద్యార్థులు ఉండగా హాజరు 6 లక్షలకు మించ డం లేదు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో సగానికి పైగా హాజరుశాతం పడిపోయిన ట్లు అధికార గణాంకాలు చెబున్నాయి.
♦రంగారెడ్డి జిల్లా పరిధిలోని 2,761 పాఠశాల్లో 6,70,046 మంది విద్యార్థులకు గాను నాలుగున్నర లక్షల మంది మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం 40 శాతానికి పడిపోయింది.
♦మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని 1,924 పాఠశాలల్లో 6,06,140 మంది విద్యార్థులుండగా హాజరు నాలుగు లక్షలకు మించడం లేదు. ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు 45 శాతానికి పడిపోయనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment