ఇప్పటివరకు టెండర్లు పిలవని మత్స్యశాఖ
సాక్షి, హైదరాబాద్: ఉచిత రొయ్య పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. అసలు ఈ ఏడాది రిజర్వాయర్లు, చెరువుల్లో రొయ్య పిల్లలు వదులుతారో, లేదో.. తెలియని పరిస్థితిల్లో మత్స్యశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినా మత్స్యశాఖ నిర్లక్ష్యంతో పథకం నిర్విర్యం అవుతోందని విమర్శలు వస్తున్నాయి.
అక్టోబర్ నెల మూడో వారం అయినా రొయ్యల పంపిణీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మత్య్సకారులు ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసం గత ఆరేళ్ల నుంచి మత్స్యశాఖ ఉచితంగా రొయ్య పిల్లలను రిజరాయర్లు, చెరువుల్లో వదులుతోంది. 2017లో ప్రారంభమైన ఈ పథకం దశల వారీగా పెరుగుతూ వచ్చి0ది.
ఈసారి టెండర్లు పిలవకపోవడంతో అసలు రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందా? ఉండదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రొయ్య పిల్లల పంపిణీపై మత్స్యశాఖ డైరెక్టర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment