గరిడేపల్లి (హుజూర్‌నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి రెవెన్యూ వ్యవ స్థను పటిష్టం చేస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ భూకబ్జాలకు, అక్రమాలకు అనుకూలంగా ఉందని, దీంతో పేదలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. 2023 జన వరి, ఫిబ్రవరి మధ్య అసెంబ్లీ రద్దవుతుందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చి తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, హుజూర్‌నగర్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నుంచి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వరకు ఇసుక మాఫియా, మైన్స్, వైన్స్, కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రాత్రి 3 గంటలకు కరెంట్ నిలుపు దల చేసి ఎలాంటి నోటీసులివ్వకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని మండిపడ్డారు. హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో భూములు ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కలెక్టర్, ఎస్పీ సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment