సాక్షి, హైదరాబాద్: పదేళ్ల శ్రీపార్ధివ్ కనిష్క్ గుత్తి ప్రతిష్టాత్మక ‘డయానా అవార్డు’అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన పార్ధివ్ ప్రస్తుతం అబుదాబిలో నివసిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత చేసిన సోషల్‌వర్క్‌ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
నిరుపేద, వెనుకబడిన పిల్లలకు విద్యను అందించినందుకు, పర్యావరణ వేత్తగా ఉన్నందుకు శ్రీపార్ధివ్‌ను ఈ అవార్డు వరించింది. పార్ధివ్ పర్యావరణ కార్యక్రమాలతో పాటు కేన్సర్ రోగుల గురించి అవగాహన పెంచడానికి రెండున్నరేళ్లు జుట్టు పెంచుకుని, తన టీమ్‌వర్క్‌లో భాగంగా 25 విగ్గులను కేన్సర్ స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment