సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ చైర్మన్, ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలిని ‘డాక్టర్ కేతన్ నేషనల్ యంగ్ లీడర్’ అవార్డు వరించింది. ప్రభుకుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఐఎంఏ ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో ఏఎంఏ హౌస్‌లో ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జాతీయ నేతలు, వైద్యరంగ ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారని అవార్డు నిర్వాహకుడు, ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్, ప్రధాన కార్యదర్శి జయేశ్ లేలే ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లో నివాసముంటున్న ప్రభుకుమార్ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అనేకమంది పేషెంట్ల కు వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ అనేకమంది మన్ననలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి అవార్డులతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment