సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రి య తుదిదశకు చేరుకుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగిసింది. కన్వినర్‌కోటా కింద మొత్తం 75 వేలమంది సీట్లు పొందినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. యాజమాన్యకోటా కింద మరో 25 వేలకుపైగా సీట్లు భర్తీ అయినట్టు తెలిసింది. అయితే పూర్తి గణాంకాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 58 శాతానికిపైగా కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లోనే భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు.
సెపె్టంబర్ 1 నుంచి కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేపడుతున్నారు. ఒక బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్‌కు మారేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కాలేజీల్లో మిగిలిన సీట్ల వివరాలు ప్రతీ కాలేజీ సెప్టెంబర్ 1న వెల్లడించాలని సాంకేతికవిద్య కమిషనరేట్ ఆదేశించింది 3,4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంసెట్ అర్హులు నేరుగా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 18,815 సీట్లు మిగిలిపోయే వీలుందని అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment