‘కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి’ | Etela Rajender About Basti Davakhana And Corona Facilities | Sakshi
Sakshi News home page

‘కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి’

Published Fri, Aug 28 2020 3:11 PM | Last Updated on Fri, Aug 28 2020 6:41 PM

Etela Rajender About Basti Davakhana And Corona Facilities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి.. అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. కరోనాకు చంపే శక్తి లేదని.. సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగిన దానిని అనుసరించామని తెలిపారు. అందులో భాగమే బస్తీ దవాఖాన అన్నారు. వీటిల్లో మందులకు కొదవ లేదని తెలిపారు. యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50-60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మరణిస్తున్న వారితో పోల్చితే.. తెలంగాణలో తక్కువగానే చనిపోతున్నారని మంత్రి ఈటల తెలిపారు. (చదవండి:కోవిడ్‌ విధుల్లో వైద్యులు మరణిస్తే..)

కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసోలేషన్‌ కిట్లు ఇస్తున్నామన్నారు ఈటల. హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్‌కు తమ మద్దతుంటుందని తెలిపారు. 80 శాతం మందికి మందులతో నయం అవుతుంది.. 4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. .ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి ఈటల తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement