UPHC
-
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్‌సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్‌సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్‌సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్‌సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్‌సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్‌కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్‌పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
ఏపీలోని యూపీహెచ్‌సీల్లో ప్రజారోగ్య సౌకర్యాలకు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీల్లో) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం గుంటూరులోని ఇందిరానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి(యూపీహెచ్సీ)ఎన్ క్యూఎఎస్ ప్రోగ్రాం కింద 96.2 శాతం స్కోర్ ఇస్తూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. అన్ని రకాలుగా ఆయా వైద్య విభాగాలు సంతృప్తికరమైన వైద్య సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకుగాను అభినందించింది. గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ పీహెచ్‌సీల్లో కల్పించిన నాణ్యమైన వైద్య సేవలకుగాను కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోర్‌ను సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి యూపీహెచ్‌సీగా గుర్తింపు పొందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబును అభినందిస్తూ లేఖ రాశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో దాదాపు 100 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కేంద్రం గుర్తింపును సాధించేందుకు కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు మే నెల 19,20 తేదీలలో గుంటూరు పట్టణంలోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించాయి. చదవండి: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్ ఇందిరా నగర్ యూపీహెచ్‌సీలో మొత్తం 12 వైద్య విభాగాల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు గాను 96.2 శాతం స్కోరును సాధించాయని విశాల్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యూపిహెచ్ సీల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలు తీరును పరిశీలించాక నివేదికలను ఎన్హెచ్ఎస్ఆర్సీ ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి ఉంటుందని లేఖలో వివరించారు. -
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
‘కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి.. అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనాకు చంపే శక్తి లేదని.. సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగిన దానిని అనుసరించామని తెలిపారు. అందులో భాగమే బస్తీ దవాఖాన అన్నారు. వీటిల్లో మందులకు కొదవ లేదని తెలిపారు. యూపీహెచ్సీ, బస్తీ దవాఖానలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50-60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మరణిస్తున్న వారితో పోల్చితే.. తెలంగాణలో తక్కువగానే చనిపోతున్నారని మంత్రి ఈటల తెలిపారు. (చదవండి:కోవిడ్ విధుల్లో వైద్యులు మరణిస్తే..) కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామన్నారు ఈటల. హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్‌కు తమ మద్దతుంటుందని తెలిపారు. 80 శాతం మందికి మందులతో నయం అవుతుంది.. 4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. .ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి ఈటల తెలిపారు. -
నర్సుకు కరోనా సిబ్బంది రోగుల్లో ఆందోళన
కంటోన్మెంట్: భయపడినంతా అయింది. యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్ టెస్టులు వద్దంటూ ప్రభుత్వ పాఠశాల ఆవరణకు మార్చినా ప్రమాదం తప్పలేదు. బోయిన్పల్లి యూపీహెచ్‌సీలో పనిచేసే నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ ఆరోగ్య కేంద్రంలో ఇటీవల వ్యాక్సిన్లు, ఇతరత్రా చికిత్స కోసం వచ్చిన బాలింతలు, చిన్నారుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తక్షణమే యూపీహెచ్‌సీని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులు సూచిస్తున్నప్పటికీ, సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే కానీ, యూపీహెచ్‌సీని మూసివేయలేమని పేర్కొంటున్నారు. వ్యాప్తి ప్రమాదముందనే... బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆనుకుని ఉండే యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్ టెస్టులకు ఏర్పాట్లు చేయగా, ఇక్కడ కరోనా పరీక్షలు నిర్వహించకూడదంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూపీహెచ్సీకి ప్రతి బుధ, శనివారం వ్యాక్సినైజేషన్ కోసం వచ్చే వందలాది మంది మహిళలు, చిన్నారులతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై వచ్చేవారికి సోకే ప్రమాదముంటుందని స్థానికులు అభ్యంతరం చెప్పారు. దీంతో పాటు యూపీహెచ్‌సీని ఆనుకునే ఉండే రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలోని మెటర్నిటీ క్లినిక్‌కు వచ్చే గర్బిణీలకూ ఇబ్బంది కలుగుతుందని సదరు నిర్వాహకులు పేర్కొన్నారు. సర్కిల్ కార్యాలయం సిబ్బంది, డిస్పెన్సరీ ఆవరణలోనే ఉన్న ప్లే గ్రౌండ్‌కు వచ్చే క్రీడాకారులు తదితరులూ కరోనా ర్యాపిడ్ టెస్టుల నిర్వహణను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తాడ్బంద్ చౌర స్తా సమీపంలో జనావాసాలకు దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో టెస్టులు నిర్వహిస్తున్నారు. తాత్కాలికంగా మూసేయాల్సిందే... ఊహించిన ప్రమాదం ముంచుకొచ్చినప్పటికీ యూపీహెచ్‌సీలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించడం ప్రమాదకరం అని బోర్డు సిబ్బంది సైతం అభిప్రాయపడుతున్నారు. యూపీహెచ్సీ నర్సుకు కరోనా సోకినట్లు తేలడంతో వెంటనే సంబంధిత ప్రాంగణాన్ని కంటైన్మెంట్ చేసేందుకు యత్నించగా, క్లినిక్ సిబ్బంది అడ్డుకున్నారు. తమ శాఖ ఉన్నతాధికారులు చెబితేనే తాము క్లినిక్ మూసేస్తామంటున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. తాము సొంత నిధులతోనే క్లినిక్‌ను శుభ్రం చేయించుకుంటామని పేర్కొనడం గమనార్హం. మేడ్చల్‌లో 28 కరోనా కేసులు మేడ్చల్: మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 28 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధాకారి డాక్టర్ మంజుల తెలిపారు. 150 మందికి పరీక్షలు నిర్వహించగా... 28 మందికి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని తెలిపారు. మేడ్చల్‌లో గడచిన వారంలో రోజుల్లో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 60కి చేరిందన్నారు. కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో... మూసాపేట: జీహెచ్ఎంసీ కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో మంగళవారం 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మూసాపేట సర్కిల్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. మూసాపేటలో 4, ఫతేనగర్‌లో 2, జింకలవాడలో 1, బాలాజీనగర్ 2, బోరబండ 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో 10 కేసులు నమోదవగా శంషీగూడలో 2, హెచ్ఎంటీ హిల్స్‌లో 2, ఎల్లమ్మబండలో 3, ఆల్విన్‌కాలనీ, సుమ్రితానగర్, బోయిన్‌పల్లిలలో ఒక్కో కేసు ప్రకారం నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో... సూరారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా కేసులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. మంగళవారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌ల్లో 51 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. షాపూర్‌నగర్ పీహెచ్సీలో 38 టెస్టులు చేయగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కుత్బుల్లాపూర్ పీహెచ్సీలో 42 మందికి టెస్టులు చేయగా 16 మందికి, సూరారం పీహెచ్సీలో 70 టెస్టులు చేయగా 23 మందికి, గాజులరామారం పీహెచ్సీలో 40 మందికి టెస్ట్‌లు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. ప్లాస్మాను డొనేట్ చేసిన పోలీస్ గోల్కొండ: కరోనాను జయించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్లాస్మాను డొనేట్ చేశారు. వివరాలివీ... గోల్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బి.అనిల్ ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారిని జయంచి పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన అనిల్ మంగళవారం అపోలో ఆస్పత్రిలో ప్లాస్మా డొనేట్ చేశారు. తన వృత్తి ధర్మంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన అనిల్‌ను గోల్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు. -
ప్రాథమిక అవస్థ కేంద్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పుండు ఒకచోట ఉంటే.. మందు మరోచోట రాస్తే ఫలితం ఎలా ఉంటుంది? నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ) పరిస్థితి ఇలాగే ఉంది. రోగులు ఒక ప్రాంతంలో ఉంటే... ఆరోగ్య కేంద్రాలను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వాంతులు,విరేచనాలు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ చికిత్సలకూ ప్రజలు పెద్దాస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. హైదరాబాద్ జిల్లా వైద్యా85 యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. కాలనీలు, బస్తీలు, ఏరియాలతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వీటిని ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బోధన, ఏరియా ఆస్పత్రుల భవనాల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడికి రోగులు రాకపోగా.. ఆయా ఆస్పత్రుల నిర్వహణ జిల్లా వైద్యారోగ్య శాఖకు భారమవుతోంది. మరోవైపు ఇక్కడికి వచ్చే బాధితులకు పెద్దాస్పత్రి సిబ్బంది వైద్యం అందిస్తుండగా... ఈ కేంద్రాల్లోని సిబ్బంది కేవలం బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేదాంట్లో రెండు.. గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు బోధనాస్పత్రుల్లో యూపీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ యూపీహెచ్సీ ఉండగా... దూద్‌బౌలి, పురానాపూల్–2 యూపీహెచ్‌సీలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. దీంతో ఏ బస్తీ రోగులకు ఏ ఆరోగ్య కేంద్రంలో సేవలు అందుతున్నాయో తెలియని పరిస్థితి. విద్యానగర్‌లోని ఏఎంఎస్ ఆస్పత్రిలో అదే పేరుతో మరో యూపీహెచ్సీ, బార్కాస్ ప్రభుత్వ హెల్త్ సెంటర్లో బార్కాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ప్రాంగణంలో తిలక్‌నగర్ యూపీహెచ్సీ, ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలోనూ మరో యూపీహెచ్సీ కొనసాగుతున్నాయి. యూపీహెచ్సీల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలు లేకపోవడం, కమ్యూనిటీ హాళ్లను ఇచ్చేందుకు ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు నిరాకరిస్తుండడంతో బోధన, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆయా బస్తీలు, కాలనీల్లోని రోగులకు సమీపంలోని ఏరియా, బోధనాస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. అదే ప్రాంగణంలో అదనంగా యూపీహెచ్‌సీని కొనసాగించడం వల్ల ప్రయోజనమేమిటని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీకి లేఖ రాశాం రోగులు ఒకచోట ఉంటే ఆస్పత్రులు మరోచోట ఉన్న మాట నిజమే. భవనాల కొరత వల్లే ఇలా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒకే భవనంలో రెండు ఆస్పత్రులు నిర్వహించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. రెండు ఆస్పత్రుల సిబ్బందిలో ఎవరు పని చేస్తున్నారో తెలియడం లేదు. సిబ్బంది పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశాం. వార్డుల వారీగా ఏదైనా ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌ను గుర్తించి అప్పగించాలని కోరాం. అవసరం లేని చోటు నుంచి యూపీహెచ్‌సీలను తరలించి అవసరమైన చోట ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు రావడంతో పాటు సిబ్బంది కొరత సమస్య కూడా తీరుతుంది. – డాక్టర్ వెంకటి, వైద్యారోగ్యశాఖఅధికారి, హైదరాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో వైద్యం ఇలా... ఏరియా ఆస్పత్రులు: కింగ్‌కోఠి, కొండాపూర్, గోల్కొండ, నాంపల్లి, వనస్థలిపురం, సురాజ్‌బాన్ (పాతబస్తీ)తప్పనిసరి ఉండాల్సిన విభాగాలు: గైనకాలజీ, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిషియన్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, రేడియాలజీ ♦ ఒక్కో ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున వస్తున్న రోగులు 400మంది ♦ వీరిలో గర్భిణులు సుమారు 200 మంది ♦ ప్రాథమిక వైద్యం కోసం వచ్చేవారు 70–80 శాతం ♦ ప్రస్తుతం పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు 250 మంది ♦ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు 15 హైదరాబాద్ జిల్లాలో ఇలా.. ♦ మొత్తం యూపీహెచ్‌సీలు 85 ♦ అర్బన్ న్యూట్రిషన్ హెల్త్ క్లస్టర్లు 14 ♦ వీటిలో 24 గంటల పాటు పని చేసేవి 9 (దారుషిఫా,యాకుత్‌పురా,హర్రజ్పెంట, పురానాపూల్–1, బేగంబజార్, చింతల్‌బస్తీ, గగన్‌మహల్, బోరబండ,పాన్‌బజార్) ♦ అంతర్జాతీయప్రమాణాల మేరకు ప్రతి వెయ్యి మందికి ఒక్క డాక్టర్ చొప్పున ఉండాలి. కానీనగరంలో ప్రతి 10వేల మందికి ఒకరు చొప్పున ఉన్నారు. ♦ ప్రతి 10వేల మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ప్రస్తుతం సిటీలో 30వేల మందికి ఒకరు చొప్పున ఉన్నారు. -
ప్రభుత్వాసుపత్రులకు 20 లక్షల ట్రెమడాల్ మాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా తీవ్రమైన నొప్పి లేదా శస్త్రచికిత్స అనంతరం బాధ నుంచి బయటపడడానికి ట్రెమడాల్ మాత్రలు వాడతారు. అది కూడా ప్రత్యేకంగా వైద్యుడు సూచిస్తేనే. అలాంటిది నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ)లో నెలల పిల్లలకు వ్యాక్సిన్ అనంతరం నొప్పి కోసం వాటిని వేయడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నెన్నో సాకులను వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెతుకుతున్నాయి. పారాసిటమాల్, ట్రెమడాల్ రెండూ ఒకేరకంగా ఉంటాయని, గందరగోళంలో ఏఎన్ఎంలు వేశారు కాబట్టి వారిని సస్పెండ్ చేశామని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ ఆఫీసర్‌ను, ఏఎన్ఎంలను సస్పెండ్ చేయడంపైనే దృష్టి పెట్టారు. కానీ ఆ మాత్రలు నాంపల్లి యూపీహెచ్సీకి ఎందుకు సరఫరా చేశారన్నది ఇప్పుడు వినవస్తున్న ప్రశ్న. వాస్తవంగా కొద్దిమొత్తంలో పంపిస్తే సరిపోయేదని, అలాంటిది 10 వేల ట్రెమడాల్ మాత్రలను నాంపల్లి ఆసుపత్రికి సరఫరా చేయాల్సిన అవసరమేంటో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఇదే విషయాన్ని కేంద్ర బృందం తన నివేదికలో ఎత్తిచూపింది. ఆ మాత్రలు ఏకంగా 300 మిల్లీగ్రాములు ఉన్నాయి. నొప్పి ఉన్నవారికి కూడా ఈ స్థాయి పరిమాణంలో మాత్రలు ఇవ్వరు. అలాంటిది పిల్లల వార్డుల్లో ఇంతటి పరిమాణంలో మాత్రలు ఎలా సరఫరా చేశారని పలువురు వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30–40 మిల్లీగ్రాములుంటేనే మత్తు వస్తుందని, అలాంటిది 300 ఎంఎంలు ఎలా సరఫరా చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతేడాది రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు ఏకంగా 20 లక్షల ట్రెమడాల్ మాత్రలను సరఫరా చేశారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఇంతటి పరిమాణంలో సరఫరా చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో అంతుబట్టడంలేదు. రెండు, మూడేళ్ల వరకు కొద్దిగానే కొన్నాం: చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ రెండు, మూడేళ్ల క్రితం వరకు టీఎస్ఎంఎస్ఐడీసీ కొద్ది మొత్తంలోనే ట్రెమడాల్ మాత్రలు కొనుగోలు చేసింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ట్రెమడాల్ మాత్రలను సరఫరా చేయడం జరిగింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ట్రెమడాల్ మాత్రలను తిరిగి వెనక్కు తెప్పిస్తున్నాం. కేంద్ర వైద్య జాబితాలో లేకున్నా..! కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ధారించిన మాత్రల జాబితాలో ట్రెమడాల్ లేదని, అలాంటి ది తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎందు కు ఈ మాత్రను కొనుగోలు చేసిందనే దానిపై ఇప్పు డు రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయిలో అంతర్గత విచారణ జరుపుతోంది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని సమాచారం. పైగా ట్రెమడాల్‌ను హెచ్‌షెడ్యూల్‌లో ఉంచాల్సింది పోయి, యూనివర్సల్ జాబితాలోకి ఎలా చేర్చారన్నది అంతుబట్టని ప్రశ్న. ఇలా నిబంధనలను ఎక్కడికక్కడ కాలరాసి ట్రెమడాల్ మాత్రలను ఇష్టానుసారంగా ఆసుపత్రులకు సరఫరా చేసే పనిలో టీఎస్ఎంఎస్ఐడీసీ మునిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్క దోవ పట్టించి కొందరు టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారు లు కంపెనీల కోసమే ఇలా చేశారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. 2016 వరకు ట్రెమడాల్ 300 మిల్లీగ్రాముల మాత్రలను టీఎస్ఎంఎస్ఐడీసీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాతే దీన్ని కొనుగోలు చేస్తున్నారు. -
ఔషధ నిల్వ అత్యంత దారుణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఔషధ నిల్వ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని కేంద్ర బృందం స్పష్టం చేసింది. శిశువులకు వ్యాక్సిన్ల అనంతరం పారాసిటమాల్ బదులు ట్రెమడాల్ మాత్రలు ఇవ్వడంతో ఇద్దరు మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర బృందం.. రెండ్రోజులు హైదరాబాద్‌లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి ఆదివారం ప్రాథమిక నివేదిక అందజేసింది. ఆ నివేదిక ప్రకారం నాంపల్లి ఆస్పత్రిలో 2018 జూన్ నుంచి ఔషధ నిల్వలను సరిగ్గా నిర్వహించడంలేదని తెలిపింది. స్టాక్ రిజిస్టర్ సరిగ్గా లేదని, ఔషధాల ఇండెంట్ ప్రక్రియా సక్రమంగా లేదని పేర్కొంది. మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్‌లు స్టాక్ రిజిస్టర్లను సరిగ్గా పర్యవేక్షించడంలేదని వెల్లడించింది. ట్రెమడాల్ వంటి షెడ్యూల్ ‘హెచ్’ఔషధాల నిల్వ ప్రక్రియ నిబంధనలను ఫార్మసిస్ట్ అనుసరించలేదని పేర్కొంది. ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై కనీసం శిక్షణ ఇవ్వకుండానే మెడికల్ ఆఫీసర్‌ను ఇటీవలే కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని దుయ్యబట్టింది. సంఘటన జరిగిన మార్చి 7న నాంపల్లి యూపీహెచ్‌సీలో 132 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. అందులో 90 మందికి ట్రెమడాల్ మాత్రలు ఇచ్చినట్లు నిర్ధారించారు. అవసరంలేని మాత్రలు ఇచ్చారని గుర్తించారు. అందులో 34 మందిని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిలోఫర్‌లో ఒకరు, ప్రైవేటు ఆసుపత్రిలో మరొకరు మరణించినట్లు నివేదిక తెలిపింది. గతేడాది హైదరాబాద్ డ్రగ్ స్టోర్‌లో 2.22 లక్షల ట్రెమడాల్ మాత్రలు ఇవ్వగా అందులో ఒక్క నాంపల్లి యూపీహెచ్‌సీకే ఏకంగా 10 వేల మాత్రలు ఇవ్వడంపై కేంద్ర బృందం విస్మయం వ్యక్తంచేసింది. ఈ నెల 9 నాటికి హైదరాబాద్ డ్రగ్ స్టోర్‌లో 1.97 లక్షల ట్రెమడాల్ మాత్రలు అందు బాటులో ఉన్నాయి. యూనివర్సల్ జాబితాలోనే ట్రెమడాల్ మాత్రలు, ఇంజక్షన్లు ఉన్నాయి. దీనివల్ల ఈ మాత్ర లేదా ఇంజక్షన్‌ను ఉపయోగించడానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయాయి. ఇక రాష్ట్రస్థాయిలో ట్రెమడాల్ మాత్రలను వెనక్కి తెప్పించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించినట్లు బృందం నివేదికలో పేర్కొంది. కేంద్ర బృందం సిఫార్సులు ఇవీ.. - పారాసిటమాల్ మాత్రలకు బదులు సిరప్‌ను ఆస్పత్రులకు సరఫరా చేయాలి. - పారాసిటమాల్ సిరప్, చుక్కల మందును ఎంత వాడారు? ఎంత వెనక్కి పంపించారన్న అంశాలపైనా రికార్డు ఉండాలి. వాటిని తక్షణమే అమలు చేయాలి. - ట్రెమడాల్ మాత్రలను యూనివర్సల్ జాబితా నుంచి తొలగించాలి. వాటి వాడకంపై ఆంక్షలు విధించాలి. నిర్ధారిత ప్రభుత్వ ఆసుపత్రులకే మాత్రలను సరఫరా చేయాలి. ఆ మేరకు డ్రగ్స్ సరఫరా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. -
యూపీహెచ్‌సీల్లో పెరుగుతున్న రోగులు
అందుబాటులో వైద్యసేవలు రెట్టింపైన సిబ్బంది 50 రకాల మందులు కరీంనగర్ హెల్త్ : నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూపీహెచ్‌సీలు)కు ప్రజాదరణ పెరుగుతోంది. రెండు వారాల క్రితం 30కి మించని రోగుల సంఖ్య ఇప్పుడు 60 వరకు వస్తున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు సిబ్బంది, మందుల సంఖ్యను పెంచారు. సెంటర్లో సౌకర్యాలు, సిబ్బంది అందుబాటులో ఉంటుండడంతో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్వర వైద్యసేవల కోసం ప్రభుత్వం నగరంలో బుట్టిరాజారాంకాలనీ, ముంతాజ్ఖాన్బస్తి, కోతిరాంపూర్‌లో అర్బన్ హెల్త్సెంటర్లను ప్రారంభించింది. కొంతకాలం వీటిని నిర్వహించిన ప్రభుత్వం తర్వాత స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. వీటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో రోగుల సంఖ్య తగ్గింది. ప్రాథమిక వైద్యసేవలతోపాటు పీహెచ్సీ స్థాయి సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. నిర్వహణ బాధ్యతల నుంచి ఎన్జీవోలను తప్పించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అప్పగించింది. ఆర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి వైద్య సేవలు అందిస్తోంది. త్వరలోనే ప్రసూతి సేవలందించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెరిగిన సిబ్బంది అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఖాళీలను అర్బన్ హెల్త్ మిషన్ పథకం కింద భర్తీ చే శారు. గతంలో బుట్టిరాజారాంకాలనీ యూపీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, మెడికల్ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్ఎంలు, స్వీపర్, వాచ్‌మన్ చొప్పున ఉండేవారు. వీరికి అదనంగా మరో మెడికల్ ఆఫీసర్(మహిళ), నలుగురు ఏఎన్ఎం, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్టు, ఒక అకౌంటెంట్, ఇద్దరు స్టాఫ్‌నర్సులను నియమించారు. ఇదే పద్ధతిలో ముంతాజŒ ఖాన్బస్తీ, కోతిరాంపూర్లలోనూ నియమించారు. కోతిరాంపూర్ యూపీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్(మహిళ) నియమాకమైన రిపోర్టు చేయకుండా విరమించుకున్నారు. 50 రకాల మందులు స్థాయి పెంచడంతోపాటు యూపీహెచ్‌సీలో 50రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతోపాటు మొత్తం 15మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. రోగులకు రక్త పరీక్షలు, మధుమేహం, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులు, సాధారణ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందబాటులో ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ మహ్మద్ సుజాయత్ తెలిపారు. వైద్యసేవలందుతున్నాయి ఈమధ్యనే ఆస్పత్రిలో మందులు ఇస్తున్నారు. డాక్టర్‌తోపాటు సిబ్బంది కూడా పెరిగారు. గతంలో మందులన్నీ ఉండేవి కావు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా ఇక్కడనే చేస్తున్నారు. ప్రైవేటులో వేలు ఖర్చుచేసి వైద్యం చేయించుకునే స్థోమత లేని ప్రజలకు నయం. - షమ్మీ సుల్తానా ఎప్పుడొచ్చినా డాక్టర్ ఉంటాడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎప్పుడొచ్చిన డాక్టర్ ఉంటాడు. పనికిపోయి సాయంత్రం వచ్చేటోళ్లకు ఈ ఆస్పత్రి నయం. ఈ మధ్యకాలంలో అన్ని పరీక్షలు కూడా చేస్తున్నరు. బరువు పనులు చేయడంతో ఛాతిలో నొప్పి వచ్చింది. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. ఇంకా ఆస్పత్రిని పెద్దగా చేస్తే అందరికి మంచిది. – గుండ్ల రాజయ్య -
పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం
♦ జిల్లాలో కొత్తగా 12 యూపీహెచ్‌సీలు ♦ పట్టణ ప్రాంతాల్లో త్వరలో ప్రారంభం ♦ కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీ కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు జిల్లాలో ఉచిత వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం ప్రతి వ్యక్తి హక్కు అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఈక్రమంలో వైద్యసేవలను మరింత ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాకు కొత్తగా 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసింది. ఇప్పటికే 48 ప్రాథమిక ఆరోగ్య కే ంద్రాలు కొనసాగుతుండగా.. తాజాగా పన్నెండు ఆస్పత్రులు ఏర్పాటు కావడంతో జిల్లాలో వీటి సంఖ్య 60కి పెరగనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా కొత్త ఆస్పత్రులు ఇక్కడే.. మన్సూరాబాద్ (సరూర్‌నగర్), మల్లాపూర్ (ఉప్పల్), వెంకట్‌రెడ్డినగర్ (ఉప్పల్), వినాయక్‌నగర్ (మల్కాజిగిరి), షాపూర్‌నగర్ (కుత్బుల్లాపూర్), పర్వత్‌నగర్ (బాలానగర్), హఫీజ్‌పేట్ (శేరిలింగంపల్లి), కుత్బుల్లాపూర్ (కుత్బుల్లాపూర్), మైలార్‌దేవ్‌పల్లి (రాజేంద్రనగర్), శివరాంపల్లి (రాజేంద్రనగర్), హసన్‌నగర్ (రాజేంద్రనగర్), ఏకలవ్యనగర్ (మల్కాజిగిరి). సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన ఆస్పత్రులన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాల్లో వైద్యశాలల సంఖ్య తక్కువుంది. మూడు ప్రాంతీయ ఆస్పత్రులతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే వీటిలో పార్ట్‌టైమ్ వైద్యులతో నిర్వహించేలా నిబంధనలున్నాయి. దీంతో తక్కువ వేతనానికి పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు కరువవడంతో అవన్నీ మూతపడే దశకొచ్చాయి. తాజాగా ఈ ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాల(యూహెచ్‌సీ)ను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ)గా అప్‌గ్రే డ్ చేసింది. అంతేకాకుండా మరో ఐదు చోట్ల వీటిని మంజూరు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. కొత్తగా మంజూరైన యూపీహెచ్‌సీల్లో ఒక మెడికల్ ఆఫీస ర్, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, అకౌం టెంట్ ఉంటారు. ఈ కేంద్రాలు నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో పోస్టు భర్తీ..: కొత్తగా ఏర్పాటుకానున్న యూపీహెచ్‌సీలకు సం బంధించి మొత్తంగా 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ నోటుఫైలు తయా రు చేసింది. తొలుత వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందు కు సంబంధించిన ఫైలును ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ కలెక్టర్‌కు అందజేసింది. ఫైలుకు ఆమోదం వచ్చిన వెం టనే జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ‘సాక్షి’తో పేర్కొ న్నాయి.