యూపీహెచ్‌సీల్లో పెరుగుతున్న రోగులు | best treatment in uphc | Sakshi
Sakshi News home page

యూపీహెచ్‌సీల్లో పెరుగుతున్న రోగులు

Published Fri, Aug 5 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

యూపీహెచ్‌సీల్లో పెరుగుతున్న రోగులు

యూపీహెచ్‌సీల్లో పెరుగుతున్న రోగులు

  • అందుబాటులో వైద్యసేవలు
  • రెట్టింపైన సిబ్బంది
  • 50 రకాల మందులు
  • కరీంనగర్‌ హెల్త్‌ : నగరంలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూపీహెచ్‌సీలు)కు ప్రజాదరణ పెరుగుతోంది. రెండు వారాల క్రితం 30కి మించని రోగుల సంఖ్య ఇప్పుడు 60 వరకు వస్తున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు  సిబ్బంది, మందుల సంఖ్యను పెంచారు. సెంటర్‌లో సౌకర్యాలు, సిబ్బంది అందుబాటులో ఉంటుండడంతో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్వర వైద్యసేవల కోసం ప్రభుత్వం నగరంలో బుట్టిరాజారాంకాలనీ, ముంతాజ్‌ఖాన్‌బస్తి, కోతిరాంపూర్‌లో అర్బన్‌ హెల్త్‌సెంటర్లను ప్రారంభించింది. కొంతకాలం వీటిని నిర్వహించిన ప్రభుత్వం తర్వాత స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. వీటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో రోగుల సంఖ్య తగ్గింది. ప్రాథమిక వైద్యసేవలతోపాటు పీహెచ్‌సీ స్థాయి సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. నిర్వహణ  బాధ్యతల నుంచి ఎన్జీవోలను తప్పించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి అప్పగించింది. ఆర్బన్‌ పీహెచ్‌సీలుగా మార్చి వైద్య సేవలు అందిస్తోంది. త్వరలోనే ప్రసూతి సేవలందించేందుకు అన్ని  ఏర్పాటు చేస్తున్నారు.  
    పెరిగిన సిబ్బంది 
    అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఖాళీలను అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద భర్తీ చే శారు.  గతంలో బుట్టిరాజారాంకాలనీ యూపీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, మెడికల్‌ అసిస్టెంట్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, స్వీపర్, వాచ్‌మన్‌ చొప్పున ఉండేవారు. వీరికి అదనంగా మరో మెడికల్‌ ఆఫీసర్‌(మహిళ), నలుగురు ఏఎన్‌ఎం, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్టు, ఒక అకౌంటెంట్, ఇద్దరు స్టాఫ్‌నర్సులను నియమించారు. ఇదే పద్ధతిలో ముంతాజŒ ఖాన్‌బస్తీ, కోతిరాంపూర్‌లలోనూ నియమించారు. కోతిరాంపూర్‌ యూపీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌(మహిళ) నియమాకమైన రిపోర్టు చేయకుండా విరమించుకున్నారు. 
    50 రకాల మందులు
    స్థాయి పెంచడంతోపాటు యూపీహెచ్‌సీలో 50రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లతోపాటు మొత్తం 15మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. రోగులకు రక్త పరీక్షలు, మధుమేహం, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు, సాధారణ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందబాటులో ఉన్నట్లు మెడికల్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ సుజాయత్‌ తెలిపారు. 
     
    వైద్యసేవలందుతున్నాయి 
    ఈమధ్యనే ఆస్పత్రిలో మందులు ఇస్తున్నారు. డాక్టర్‌తోపాటు సిబ్బంది కూడా పెరిగారు. గతంలో మందులన్నీ ఉండేవి కావు. బీపీ, షుగర్‌ పరీక్షలు కూడా ఇక్కడనే చేస్తున్నారు. ప్రైవేటులో వేలు ఖర్చుచేసి వైద్యం చేయించుకునే స్థోమత లేని ప్రజలకు నయం.
    - షమ్మీ సుల్తానా
     
    ఎప్పుడొచ్చినా డాక్టర్‌ ఉంటాడు 
    మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎప్పుడొచ్చిన డాక్టర్‌ ఉంటాడు. పనికిపోయి సాయంత్రం వచ్చేటోళ్లకు ఈ ఆస్పత్రి నయం. ఈ మధ్యకాలంలో అన్ని పరీక్షలు కూడా చేస్తున్నరు. బరువు పనులు చేయడంతో ఛాతిలో నొప్పి వచ్చింది. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. ఇంకా ఆస్పత్రిని పెద్దగా చేస్తే అందరికి మంచిది.
    – గుండ్ల రాజయ్య 
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement