పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం | primary health centers in city | Sakshi
Sakshi News home page

పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం

Published Wed, May 4 2016 2:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం - Sakshi

పట్టణ పేదలకు.. ముంగిట్లో వైద్యం

జిల్లాలో కొత్తగా 12 యూపీహెచ్‌సీలు
పట్టణ ప్రాంతాల్లో త్వరలో ప్రారంభం
కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీ కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు

 జిల్లాలో ఉచిత వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం ప్రతి వ్యక్తి హక్కు అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఈక్రమంలో వైద్యసేవలను మరింత ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాకు కొత్తగా 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసింది. ఇప్పటికే 48 ప్రాథమిక ఆరోగ్య కే ంద్రాలు కొనసాగుతుండగా.. తాజాగా పన్నెండు ఆస్పత్రులు ఏర్పాటు కావడంతో జిల్లాలో వీటి సంఖ్య 60కి పెరగనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా

కొత్త ఆస్పత్రులు ఇక్కడే..
మన్సూరాబాద్ (సరూర్‌నగర్), మల్లాపూర్ (ఉప్పల్), వెంకట్‌రెడ్డినగర్  (ఉప్పల్), వినాయక్‌నగర్ (మల్కాజిగిరి), షాపూర్‌నగర్ (కుత్బుల్లాపూర్), పర్వత్‌నగర్ (బాలానగర్), హఫీజ్‌పేట్ (శేరిలింగంపల్లి), కుత్బుల్లాపూర్ (కుత్బుల్లాపూర్), మైలార్‌దేవ్‌పల్లి (రాజేంద్రనగర్), శివరాంపల్లి (రాజేంద్రనగర్), హసన్‌నగర్ (రాజేంద్రనగర్), ఏకలవ్యనగర్ (మల్కాజిగిరి).

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లాకు కొత్తగా మంజూరైన ఆస్పత్రులన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాల్లో వైద్యశాలల సంఖ్య తక్కువుంది. మూడు ప్రాంతీయ ఆస్పత్రులతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే వీటిలో పార్ట్‌టైమ్ వైద్యులతో నిర్వహించేలా నిబంధనలున్నాయి. దీంతో తక్కువ వేతనానికి పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు కరువవడంతో అవన్నీ మూతపడే దశకొచ్చాయి.

తాజాగా ఈ ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాల(యూహెచ్‌సీ)ను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ)గా అప్‌గ్రే డ్ చేసింది. అంతేకాకుండా మరో ఐదు చోట్ల వీటిని మంజూరు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. కొత్తగా మంజూరైన యూపీహెచ్‌సీల్లో ఒక మెడికల్ ఆఫీస ర్, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, అకౌం టెంట్ ఉంటారు. ఈ కేంద్రాలు నిరంతరంగా పనిచేయాల్సి ఉంటుంది.

 త్వరలో పోస్టు భర్తీ..: కొత్తగా ఏర్పాటుకానున్న యూపీహెచ్‌సీలకు సం బంధించి మొత్తంగా 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ నోటుఫైలు తయా రు చేసింది. తొలుత వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందు కు సంబంధించిన ఫైలును ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ కలెక్టర్‌కు అందజేసింది. ఫైలుకు ఆమోదం వచ్చిన వెం టనే జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ‘సాక్షి’తో పేర్కొ న్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement