
సాక్షి ప్రతినిధి, వరంగల్: కరోనా యావత్ మానవాళికి పెను సవాల్‌గా మారిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయితే, మన దేశంలో కరోనా వైరస్ అమెరికా అంత సీరియస్ కాదన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది కోవిడ్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారని, వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
అవి కరోనా చావులు కాదు
కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదని, ఆ అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో రోజుకు వెయ్యి మంది చనిపోతారు.. అవన్నీ కరోనా చావులు కాదన్నారు. కరోనా విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగాఉందన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది కరోనా బాధితుల్లో ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించడం లేదని. అందులో కేవలం 19 శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇందులోనూ 14 శాతం మందికి నయమవుతోందని చెప్పారు. కేవలం 4 నుంచి 5% అంతకు ముందే జబ్బులున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే సమస్య ఉందని, వారిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment