తన వ్యవసాయ క్షేత్రంలోని రెడీమేడ్ ఇంటి ఎదుట లక్ష్మణ్
సాక్షి, ఆదిలాబాద్: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దాంపూర్ గ్రామానికి చెందిన నైతం లక్ష్మణ్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన వ్యవసాయ క్షేత్రంలో రెడీమేడ్ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మణ్‌కు పదెకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆరెకరాల్లో ఆయిల్‌పాం, నాలుగెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. వారాంతపు సెలవుల్లో కుటుంబ సభ్యులతో వ్యవసాయక్షేత్రంలో సేదతీరేందుకు ఓ ఇల్లు కావాలనుకున్నాడు.
ఇంటి లోపలి భాగం
వెంటనే ఆర్డర్ పెట్టి రూ.4.80లక్షలతో రెడీమేడ్ ఇంటిని హైదరాబాద్ నుంచి తెప్పించాడు. ఇందుకు రవాణా ఖర్చు మరో రూ.45వేలు వెచ్చించాడు. ఈ రెడీమేడ్ ఇంటిలో బెడ్రూం, హాల్, కిచెన్, బాత్రూం ఇలా అన్ని వసతులున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నాడు. కాగా, రెడీమేడ్ ఇల్లును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
చదవండి: Hyderabad: నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల నీరు నేలపాలు
Comments
Please login to add a commentAdd a comment