జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ | Hyderabad Famous Bathini Fish Prasadam Distribution Begins On June 8, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad Fish Prasadam Distribution: జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

Published Tue, May 21 2024 7:15 AM | Last Updated on Tue, May 21 2024 9:58 AM

Fish Prasadam Distribution Begins On June 8

బత్తిని కుటుంబ సభ్యులు 

హైదరాబాద్: ఆస్తమా, ఉబ్బసం సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చేప ప్రసాదం ఈ సంవత్సరం జూన్‌ 8వ తేదీన శనివారం ఉదయం 11 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నా«థ్‌గౌడ్, శివ శంకర్‌ గౌడ్, గౌరీశంకర్‌ గౌడ్‌లు మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా చేప ప్రసాదం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

తరువాత 3 రోజులపాటు దూద్‌»ౌలిలోని తమ నివాసం వద్ద పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3 లక్షల చేప పిల్లలు సిద్ధంగా ఉంచినట్లు, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, వాటర్‌వర్క్స్, మున్సిపాలిటీ, పోలీస్‌ ఎప్పటిలాగే సహాయ సహకారాలు అందించాలని లేఖలు రాసినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో జూన్‌ 7వ తేదీ ప్రసాదం పంపిణీ అని వార్తలు వస్తున్నాయని, అది తప్పుడు వార్త అని..8నే ప్రసాదం పంపిణీ ఉంటుందని చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement