
వరద బాధితులకు కిట్ అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం: మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ముంపు బాధితులకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వితరణ అందించారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించిన ఆయన..15 వేల మంది బాధితులకు రూ.కోటి విలువైన నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపు మేరకు ‘స్మైల్ ఏ గిఫ్ట్’లో భాగంగా ఈ సరుకులు అందించినట్లు చెప్పా రు. ముంపు బాధితులకు టీఆర్‌ఎస్ ప్రభు త్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment